Header Ads

తాత భీముడిని సైతం అలవోకగా ఓడించిన బార్బరీకుడు(బలియదేవ్),కృష్ణుడి చేతిలో చావడానికి గల కారణం?బార్బరీకుడి పూర్తి కధ మీకోసం.!

ఘతోత్కచుడు కొడుకు అయిన బార్బరీకుడు అత్యంత బలశాలి, తాత భీముడిని సైతం ఓడించిన బలశాలి, బార్బరీకుడు శ్రీ కృష్ణుడి చేతిలో మరణించడానికి గల కారణాలు ఏమిటి?...ఘతోత్కచుడు, మౌరావి కి కలిగిన సంతానం ఎ బార్బరీకుడు, ప్రజలకు కుటుంబం కి సాయం చేసే విదంగా బలశాలి గా తయారు అవ్వు, దేవీ ని ఆరాధించడం వలన, నీవు బలశాలి అవుతావు అని శ్రీ కృష్ణుడు బార్బరీకుడు తో చెబుతాడు. శ్రీ కృష్ణుడి అనుగ్రహం తో బార్బరీకుడు దేవీ ని ఆరాధించడం మొదలు పెడతాడు, ఆలా దేవీ ని ఆరాధించడం మొదలు పెట్టిన నాటి నుండి ఎందరో అసురులను, రాక్షసులను అంత మొందించాడు, చేసిన సాయానికి ప్రతి ఫలం ఆశించని వ్యక్తి బార్బరీకుడు, విజయుడు తో కలిసి దేవీ దీక్షను ముగించిన వెంటనే, నీవు చేసిన సాయం వలెనే యజ్ఞం పూర్తి అయ్యింది అని విజయుడు బార్బరీకుడు తో అంటాడు,ఈ యజ్ఞ బూడిదని తీసుకో యుద్ధం లో శత్రువుల మీదకు చల్లితే వారు భస్మం అవుతారు అని విజయుడు బార్బరీకుడితో అంటాడు, కానీ బార్బరీకుడు ఆ భస్మాన్ని తీసుకోడానికి అంగీకరించడు, ఎటువంటిది ఆశించకుండా సాయం చేశాను, ఈ భస్మము నాకు వద్దు అని బార్బరీకుడు విజయుడితో అంటాడు. అప్పుడు ఆకాశ వాని రాబోయే కాలములో కౌరవ పాండవుల యుద్ధం జరగబోతుంది, కౌరవులు కానీ ఈ భస్మమును కొట్టేసినచో పాండవులని యుద్ధం లో భస్మము చేస్తారు, కనుక ఈ భస్మమును నీవే గ్రహించుము అని తెలుపుతుంది. ఆకాశ వాని మాట విని బార్బరీకుడు ఆ భస్మాన్ని గ్రహిస్తాడు, సిద్ధి వలన భస్మము పొందాడు కాబట్టి బార్బరీకుడిని 'సిద్ద సేనుడు' అని పిలుస్తారు..

ఒక నాడు భీముడు తన సోదరులతో కలిసి ఈశాన్య వైపునున్న చండికా దేవీ ఆలయానికి వెళ్తాడు, ఎంతో దూరం నుండి వచ్చిన వలన దాహం తో అల్లాడిపోతాడు భీముడు, గుడికి చేరుకున్నాక, అక్కడ కోనేటి నీటి ని త్రాగాలని కోనేరులోకి దిగుతాడు, కోనేరు నుండి ఒక పాత్ర లో నీరు తెచ్చుకొని కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్న పిమ్మట కోనేరులోకి దిగమని ధర్మరాజు భీముడితో అంటాడు , కానీ ధర్మరాజు మాటలు లెక్క చేయకుండా కోనేరు లోకి దూకుతాడు. ఆ సమయానికి బార్బరీకుడు కూడా అక్కడికి చేరుకుంటాడు, భీముడిని కోనేరు లో చూసి భీముడితో వాగ్వాదానికి దిగుతాడు...అమ్మ వారి పవిత్రమైన కోనేరు లో అపరిశుభ్రంగా ఉన్న నీవు దిగడం తప్పు అని, బయటికి వచ్చి నీళ్లు త్రాగుము అని చెబుతాడు, ఆగ్రహం తో భీముడు కూడా మాటల యుద్ధనికి దిగుతాడు, ఇరువురు చాలా సేపు వాగ్వాదించుకున్నాక భీముడు బార్బరీకుడితో, కాకి లా అరుస్తావ్ ఏమి రా నోరు మూసుకొని ఉండు అని చెబుతాడు, ఆ మాటతో ఆగ్రహానికి గురి అయిన బార్బరీకుడు, భీముడి పైన బాండ రాయి విసురుతాడు, ఆ తరువాత ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది, బర్బరీకుడి చేతిలో దెబ్బలు తిని మూర్ఛ పోతాడు భీముడు, అప్పుడు భీముడిని ఎత్తి సముద్రంలో పారివేయాలి అనుకుంటాడు బార్బరీకుడు, ఇంతలో పరమ శువుడు ప్రత్యేక్షం ఐ, భీముడు నీ తాత అని బార్బరీకుడు తో చెప్తాడు, తాను పాపం చేశాను, తాత గారినే గాయ పరిచాను అని పశ్చాత్తాపంతో అదే సముద్రంలోకి దూకాలనుకుంటాడు, పరమ శివుడు బార్బరీకుడు ని అడ్డుకొని, ఇందులో నీ తప్పు ఏమియు లేదు, భీముడు నీ తాత అని తెలియక నీవు ఇలా చేసావు, అని చెబుతాడు, భీముడు బార్బరీకుడిని కౌగిలించుకొని మనవడి శక్తిని చూసి ఆనంద పడిపోతాడు.

ఈ సంఘటనలు అన్ని బార్బరీకుడు పుట్టిన 13 వ సంవత్సరాల వయసు లోపలే జరుగుతాయి. అంటే భీముడిని ఓడించినప్పుడు బార్బరీకుడి వయసు 13 సంవత్సరాలే. ఆ తరువాత బార్బరీకుడు శివుని కోసం ఘోరమైన తప్పస్సు చేస్తాడు, శివుడు ప్రత్యేక్షం అయ్యాక ఆయన నుండి మూడు గురి తప్పని బాణాలు వరం గా పొందుతాడు. ఆ మూడు బాణాలలో మూడు లోకాలని భస్మము చేయగలిగే శక్తి ఉంటుంది.బార్బరీకుడికి చిన్న నాటి నుండి యుద్ధ విద్యలలో ఆరి తేరుతాడు, తన తల్లి ఎ తనకి అన్ని విద్యలు నేర్పిస్తుంది.
కౌరవులు, పాండవులకు యుద్ధం మొదలవ్వు సమయం లో ఎవరి పక్కన ఉండి యుద్ధం చేయాలో తల్లి ని అడుగుతాడు, కౌరవులు సైనికుల సంఖ్య పాండవుల కంటే ఎక్కువ, పాండవుల దెగ్గర బలం తక్కువ ఉంది కాబట్టి పాండవుల తరుపున పోరాటం చేయమని చెబుతుంది.తల్లి మాటను విని పాండవుల తరుపున యుద్ధం చేయడానికి సిద్ద పడతాడు. శ్రీ కృష్ణుడు పాండవులలో అందరిని కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజుల్లో ముగించగలరు అని అడిగితే, ప్రతి ఒక్కరు 20 రోజులు 25 రోజులు అంటూ చెప్పసాగారు, కానీ బార్బరీకుడు మాత్రం ఒక్క నిమిషం లోనే ముగిస్తా అని చెబుతాడు. యుద్ధం మొదలవుతుంది,బార్బరీకుడు యుద్దానికి వస్తున్న సమయం లో శ్రీ కృష్ణుడు ఒక బ్రాహ్మణుడిలా వేషం మార్చుకొని బార్బరీకుడికి అడ్డు వస్తాడు, ఎటు వెళ్తున్నావ్ అని అడిగితే, యుద్ధనికి వెళ్తున్న అని బార్బరీకుడు చెబుతాడు, నీ బాణాలేవి అని శ్రీ కృష్ణుడు అడిగితే, ఇవిగో మూడు బాణాలు అని బార్బరీకుడు చూపిస్తాడు, శ్రీ కృష్ణుడు పెద్దగా నవ్వి, మూడు బాణాలతో కురుక్షేత్రం ముగించగలవా అని శ్రీ కృష్ణుడు అడిగిన ప్రశ్నకు బార్బరీకుడు బదులిస్తూ,ఇవి సామాన్యమైన బాణాలు కావని, గురి తప్పని బాణాలని, ఒక బాణం శత్రువులను గుర్తిస్తుంది అని, ఇంకోటి మనవాళ్ళని గుర్తిస్తుంది అని, మూడోది గుర్తించిన శత్రువులను హతమారుస్తుందని చెబుతాడు. ఆ విషయం నేను నమ్మను అని శ్రీ కృష్ణుడు చెప్పడంతో, ఒక చెట్టుని చూపించి అందులో ఒక ఆకు మీద ప్రయోగించమంటాడు బాణాన్ని, ఆ ఆకుని శ్రీ కృష్ణుడు పాదం లో దాచిపెడతాడు, బాణం చెట్టులోని ఆకులన్నీ చూసి చివరికి  శ్రీ కృష్ణుడి పాదం చుట్టూ తిరిగి ఒక రకమైన గుర్తుని పాదం మీద ఏర్పాటు చేస్తుంది ఇంతలో యుద్ధం ఇంకో వాపియూ యుద్ధం కొనసాగుతుంది.

కౌరవుల బలగం తగ్గడం తో,బార్బరీకుడు వాళ్ళ పక్షాన పోరాతాడు అనుకోని కృష్ణుడు బర్బరీకుడిని ఒక వరం అడుగుతాడు నీ తల తీసి నేల మీద పెట్టు అని బ్రాహ్మణ వేషంలో ఉన్న కృష్ణుడు బర్బరీకుడితో అంటాడు, బ్రాహ్మణుడు వేషధారణ లో వేరే వాళ్లు ఎవరో వచ్చారని గ్రహిస్తాడు బార్బరీకుడు, వేషం నుండి బయటికి వస్తే వరాన్ని ప్రసాదిస్తా అని బార్బరీకుడు చెప్పగా, శ్రీ కృష్ణుడు బ్రాహ్మణ వేషధారణ నుండి బయటికి వస్తాడు. గత జన్మలో నీకు  ఉన్న శాపం వల్లే ఇలా నేను చేయాల్సి వచ్చింది అని శ్రీ కృష్ణుడు బర్బారీకుడితో చెబుతాడు. తాను ఈ కురుక్షేత్ర యుద్ధం అయిపోయేంత వరకు చూడాలని బార్బరీకుడు శ్రీ కృష్ణుడిని వరం అడుగుతాడు. కురుక్షేత్రం లో ఎతైన పర్వతం మీద బార్బరీకుడి తలను ఉంచుతాడు శ్రీ కృష్ణుడు, 18 రోజులు అక్కడి నుండే కురుక్షేత్ర యుద్దాన్ని వీక్షిస్తాడు బార్బరీకుడు. కురుక్షేత్రం అయిపోయాక ఎవరు గొప్ప అని చర్చించుకుంటూ ఉంటారు, బర్బరీకుడి దెగ్గరికి వచ్చి ఎవరు గొప్ప అని అడిగితే, శ్రీ కృష్ణుడే తన చక్రం తో దుష్ట సంహారం చేసినట్టు తన కంటికి కనిపించిందని బార్బరీకుడు చెబుతాడు. ఆ తరువాత శ్రీ కృష్ణుడు బర్బరీకుడి తలను రూపవతి అనే నది లో విసురుతాడు, ఆ తల తరువాత కలియుగం లో రాజస్థాన్ లోని కట్టు అనే గ్రామం లో దొరుకుతుంది, అదే ప్రాంతం లో రూప్ సింగ్ అనే రాజు గుడి కట్టిస్తాడు,ఆ గుడిలో బార్బరీకుడిని కాటు శ్యామ్ బాబా గా పూజిస్తారు, ఇంకా బర్బరీకుడిని హిమాచల్ ప్రదేశ్లో కమ్రన్ పేరుతోనూ, నేపాల్ లో కింగ్ యెలాంబార్ అని ఆకాష్ భైరవ్ అని పూజిస్తారు, గుజరాత్ లో బలియదేవ్ అని పూజిస్తారు.

No comments