Header Ads

రేగి పండులో ఆల్కహాల్ (మద్యం) కంటెంట్ ఉందా.? వైరల్ అవుతున్న వీడియో లో నిజమెంత.?

రేగి పండు లో ఆల్కహాల్ కంటెంట్ ఉంది అని అందరు చెబుతున్నారు, అసలు రేగి పండు లో ఆల్కహాల్ ఉండటం ఏంటి? చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరు రేగి పండ్లను ఇష్టం గా తింటారు. ఇటీవల రేగి పండులో ఆల్కహాల్ కంటెంట్ ఉందని, రేగి పండు తిని బండి నడిపేటప్పుడు, దారిలో పోలీస్ లు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినప్పుడు, బ్రీత్ అనలైజర్ ఆల్కహాల్ కంటెంట్ ని డిటెక్ట్ చేస్తుందని ఒక వీడియో తీశారు, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది,


రేగి పండ్లలో ఆల్కహాల్ కంటెంట్ ఉంది అంటే ఎవ్వరు నమ్మరు, దీన్ని నిరూపించడానికి పోలీస్ లు నిర్వహించిన టెస్ట్ లో, రేగి పండ్లు తిన్నాక బ్రీత్ అనలైజర్ చెక్ చేస్తే ఆల్కహాల్ కంటెంట్ ను చూపియ్యలేదు. మద్యం సేవిస్తేనే బ్రీత్ అనలైజర్ ఆల్కహాల్ కంటెంట్ ని డిటెక్ట్ చేస్తుందని పోలీస్ లు తెలిపారు, రేగి పండు ఆరోగ్యానికి చాలా మంచిది, రేగి పండు తిని బండి నడిపితే బ్రీత్ అనలైజర్ లో ఆల్కహాల్ కంటెంట్ చూపిస్తుంది అని వైరల్ అవుతున్న వీడియో నిజం కాదని పోలీస్ లు చెప్పారు, ఆ వీడియో లో ఉన్నదీ ఫేక్ మెషిన్, ఆ వీడియో మొత్తం ఫేక్, గవర్నమెంట్ మెషిన్ లు కేవలం ఆల్కహాల్ తాగిన వాళ్ళు గట్టిగా ఊదితే, ఆల్కహాల్ కంటెంట్ ను చూపిస్తాయి. ఒక వేళ రేగిపండు ని మద్యం లో ఎక్కువ సేపు ఉంచి తింటే అప్పుడు ఆల్కహాల్ కంటెంట్ ని చూపిస్తుంది. రేగి పండ్ల మీద వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని తేలిపోడం తో రేగి పండ్లను ఎవరైనా, ఎప్పుడైనా తినొచ్చు.

Watch Video:

https://www.facebook.com/Tarakapuri/videos/748223258871502/

No comments