Header Ads

జబర్దస్త్ లో ఇక పైన అనసూయ యాంకరింగ్ చేయదా.?

జబర్దస్త్ నుండి అనసూయ యాంకర్ గా తప్పుకున్నట్టు సోషల్ మీడియా లో చాలా పుకార్లు చెక్కర్లు కొడుతున్నాయి, అనసూయ ప్లేస్ లో జబర్దస్త్ లో గత రెండు వారాలుగా వర్షిణి యాంకరింగ్ చేస్తుంది, దింతో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బయ్ చెప్పేసింది అని అందరు అనుకుంటున్నారు, ఇదే విషయం మీద జబర్దస్త్ టీం లో ఒకరు క్లారిటీ ఇచ్చారు.




అనసూయ ప్లేస్ లో వర్షిణి:

అనసూయ ప్లేస్ లో జబర్దస్త్ లో వర్షిణి యాంకర్ గా వ్యవహరిస్తోంది, కానీ ఇది తాత్కాలికం మాత్రమే, అనసూయ ప్రస్తుతం మూవీ షూటింగ్స్ లో బిజీ గా ఉంది, అందువలన కొన్ని వారాల వరకు తాత్కాలికంగా వర్షిణి జబర్దస్త్ లో యాంకర్ గా వ్యవహరించనుంది అని తెలిపారు.

రెండు మూడు వారాలు అయితే అనసూయ ప్లేస్ లో రష్మీ ని పెట్టొచ్చు కదా, కొత్త అమ్మాయి ఎందుకు?

రష్మీ కూడా పలు సినిమాల్లో నటిస్తుంది, అలాగే వేరే షోస్ లో యాంకర్ గా వ్యవహరిస్తోంది, ప్రస్తుతానికి జబర్దస్త్ షూట్ టైం కి వర్షిణి అందుబాటులో ఉండటం తో, వర్షిణి ని ఎంపిక చేసాం అని తెలిపారు.

ఢీ ప్రోగ్రాం తో వర్షిణి బాగా ఫేమస్ అయ్యింది, పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది వర్షిణి. వర్షిణి హీరోయిన్ గా నటించిన పెళ్లి గోల వెబ్ సిరీస్ కు మంచి స్పందన వచ్చింది.జబర్దస్త్ షో ద్వారా రష్మీ కూడా ఫుల్ పాపులర్ అయ్యింది, గుంటూరు టాకీస్ చిత్రం లో హీరోయిన్ గా నటించింది రష్మీ, ఆ సినిమా కమర్షియల్ గా క్లిక్ అవ్వడం తో, ఆ తరువాత నుంచి సినిమాల్లో ఛాన్స్ లు పెరిగాయి రష్మీ కి. రంగస్థలం సినిమా లో రంగమ్మత పాత్రా లో నటించిన అనసూయకు, ఆ సినిమా తరువాత ఛాన్స్ లు వెల్లువెత్తడం మొదలయ్యాయి, అందుకే చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ బిజీ గా ఉంది అనసూయ, త్వరలోనే తిరిగి జబర్దస్త్ లో మళ్ళీ యాంకర్ గా రానుంది అనసూయ.

No comments