Header Ads

కనీ వినీ ఎరుగని రీతిలో అంబానీ కూతురి పెళ్లి..'పెళ్లి కార్డు' విలువ తెలిస్తే ఆశ్చర్య పోతారు..?

'జియో' సిం తో ఒక్క సరిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు అనిల్ అంబానీ, అప్పటి వరకు దేశం లో పెద్ద పారిశ్రామిక వేతల్లో ఒకరిగా ఉన్న అనిల్ అంబానీ, ఒక్క సారిగా సెలబ్రిటీ అయిపోయాడు, ముఖ్యంగా యూత్ లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది, అంబానీ బాబాయ్, అంబానీ మామయ్య అంటూ పిలవడం మొదలెట్టారు. దేశంలోనే అపర కుబేరుడు రిలయన్స్‌ ఇండస్ట్రీ సంస్థలకు రారాజు. ముఖేష్‌ అంబానీ కూతురు పెళ్లంటే మామూలు విషయమా? పెళ్లికోసం ఆకాశమంత పందిరి ఉండాల్సిందే. అందు కోసం అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే పెళ్లి వేడుక ఉండడంతో ముఖేష్‌ కూతురి పెళ్లి వేడుక కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
తాజాగా అత్యంత ఖర్చుతో కూడుకున్న వెడ్డింగ్‌ కార్డును అంబానీ కుటుంబం విడుదల చేసింది.. మామూలుగా పెళ్లి కార్డును కార్డు రూపంలో తయారు చేసి బంధు మిత్రులకు ఇస్తాం. కానీ ముఖేష్‌ అంబాని గారాల పట్టి పెళ్లి కార్డు కోసం ఏకంగా ఓ పెట్టెనే రూపొందించారు. బంగారం పూతతో కూడిన పెట్టె ఓపెన్‌ చేసి చూస్తే లక్ష్మీదేవి చిత్రపటంతో రూపొందించిన పెళ్లికార్డు దర్శనమిస్తుంది. కలర్‌ఫుల్‌గా రూపొందించిన ఈ పెళ్లి కార్డు ఆకట్టుకుంటోంది. అత్యంత రాయల్‌ లుక్‌తో రూపొందించిన ఈ వెడ్డింగ్‌ కార్డు ఖరీదు విలువ ఒక్కొక్కటీ 50 వేల రూపాయలపైనే ఉంటుందని సమాచారం. వివిధ రంగాల్లోని ప్రముఖులు అందరికి ఈ కార్డును అందజేసి పెళ్లికి ఆహ్వానించనున్నారు.
ఈ మధ్య కాలంలో వచ్చిన వెడ్డింగ్‌ కార్డుల్లో ఇదే అంత్యంత రిచ్‌గా, అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. ఇప్పటికే ఈషా అంబానీ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. డిసెంబరు 12న ఆమె పెళ్లి పిరమాల్‌ గ్రూప్‌ అధినేత అజయ్‌ పిరమాల్‌ కుమారుడు ఆనంద్‌ పిరమాల్‌తో అంగరంగ వైభవంగా జరగబోతోంది. పెళ్లి వేడుక ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై ఊహాగానాలు వస్తున్న సమయంలో, ముంబయిలోని ముకేశ్‌ అంబానీ స్వగృహంలోనే ఈ వేడుక ఉండబోతోందని ఇరు కుటుంబ వర్గాలు ధ్రువీకరించాయి. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో.. భారతీయ సంస్కృతి, సంప్రదాయ పద్దతిలో అంబానీ స్వగృహంలో ఈ వేడుక జరగనుంది.
వివాహ వేడుకకు ముందు వారాంతంలో అంబానీ, పిరమాల్‌ కుటుంబాలు, వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఉదయ్‌పూర్‌లో ఘనంగా విందు ఏర్పాటు చేయబోతున్నారు. గత సెప్టెంబర్‌ నెలలోనే ఇషా అంబానీ నిశ్చితార్థం అజయ్ పిరమాల్‌ తనయుడు ఆనంద్ పిరమాల్‌తో వైభవంగా జరిగింది. ఇందుకు ఇటలీలోని లేక్ కోమో వేదికైంది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశ విదేశాల నుండి ముఖ్యమైన వ్యక్తులు ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. ఇటలీ నది తీరంలో ఎంగేజ్‌మెంట్‌ వేడుక కళ్లు జిగేల్‌ మనేలా జరిగింది. ఈషా, ఆనంద్‌ చాలాకాలంగా స్నేహితులు. అంబానీ, పిరమల్‌ కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలుగా మంచి స్నేహం ఉంది. ఆనంద్‌ పిరమల్‌ ఇటీవలే మహాబలేశ్వర్‌లో ఒక గుడి దగ్గర ఈషాకు ప్రపోజ్‌ చేశారు. ఆమె ఒప్పుకోవడం.. ఇరువైపులా పెద్దలకు తెలియజేయడం వాళ్లూ అంగీకరించడం వేగంగా జరిగిపోయాయి. అంబానీ కూతురి పెళ్లి కావడం తో జియో సిం కస్టమర్ లకు ఎటువంటి సర్ప్రైస్ లని ఇస్తాడో చూడాలి, త్వరలోనే జియో ఫైబర్ నెట్ అందుబాటులోకి రాబోతుంది, జియో సిం తో ఎలాగైతే భారత దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపాడో, జియో ఫైబర్ నెట్ తో కూడా అదే రకంగా సంచలనం సృష్టిస్తాడని నెటిజెన్ లు కామెంట్స్ చేస్తున్నారు.

No comments