Header Ads

టీ హ‌బ్‌కు అత‌డే దిక్సూచి..!

ఎక్క‌డ చూసినా టి హ‌బ్ . ఏమిటిది అనుకుంటున్నారా. ఇటీవ‌ల ప్ర‌తి ఒక్క‌రు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఇదో కొత్త ఒర‌వ‌డి. డ‌బ్బులు లేవ‌ని బాధ ప‌డాల్సిన ప‌నేలేదు. నీ ద‌గ్గ‌ర ద‌మ్ముందా. ఒక‌రి కింద ప‌నిచేయ‌డం . ఇంకొక‌రు చెబితే చేసే రోజులు పోయాయి. కొత్త ఐడియా ఉంటే చాలు. ఎంచ‌క్కా పెట్టుబ‌డితో పాటు వెంచ‌ర్ కేపిట‌ల్ కూడా మ‌న‌వ‌ద్ద‌కే వ‌స్తుంది.
ఇంకెందుకు ఆల‌స్యం. హై టెక్ సిటీలోని మాదాపూర్ లో టీ – హ‌బ్‌ను సంద‌ర్శించండి. మీ ప్ర‌తిభ‌కు మెరుగులు దిద్దుకోండి. అపార‌మైన అవ‌కాశాలు. ఎల్ల‌లు లేని ఉప‌యోగాలు. కావాల్సింద‌ల్లా గుండె ధైర్యం కావాలి. నీతో పాటు మ‌రో ప‌ది మందికి ఉపాధి చూపించే స‌త్తా నీకుండాలి. ఇక్క‌డ రిజ‌ర్వేష‌న్లు ఉండ‌వు. కుల‌, మ‌తాల ప్ర‌స‌క్తి రానే రాదు. ఒన్ అండ్ ఓన్లీ నువ్వే. నీకు నీతోనే పోటీ. నీ ద‌గ్గ‌ర ఎవ్వ‌రీ వ‌ద్దా లేని ఆలోచ‌న‌. దానికి కావాల్సిన ముడి స‌రుకు. మార్కెట్‌లో నీదైన బ్రాండ్ నువ్వు క్రియేట్ చేసుకోగ‌లిగితే. డాలర్ల వ‌ర్షం కురుస్తుంది.

టాటా, ఇన్ఫోటెక్‌, గూగుల్‌, ఫేస్ బుక్‌, పొలారిస్‌, అడోబ్ ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్ల‌లు..కంపెనీలు నీ ముందు వాలి పోతాయి. నీతో ఇప్ప‌టికిప్పుడే జ‌త క‌డ‌తాయి. ఇదో న‌యా ట్రెండ్‌. ఇదో క‌ల‌ల‌ను సాకారం చేసుకునేందుకు అందివ‌చ్చిన స‌ద‌వ‌కాశం. కోరిక‌లు వుంటే స‌రిపోదు. ఆలోచ‌న‌లు వ‌స్తే ఏం లాభం. వాటిని ఆచ‌ర‌ణ‌లో పెట్టాలిగా. దానికో ప్రాజెక్టు కావాలి. అది స‌మాజానికి మేలు చేసేది అయి వుండాలి. అంత‌కంటే కొంత‌కాలం పాటు నిర్దిష్టంగా ఉండ‌గ‌లిగితే చాలు క‌రెన్సీ నీ పాకెట్‌లోకి వ‌చ్చేస్తుంది.

ఇదంతా తెలంగాణ స‌ర్కార్ సాధించిన ఘ‌న‌త‌. దీని వెనుక అకుంఠిత‌మైన దీక్ష వుంది. అంత‌కంటే చాకులాంటి కుర్రాడి వెన్నుద‌న్ను నిలిచిన స్టోరీ వుంది. టీ-హ‌బ్ ఇవాళ ప్ర‌తి ఇంట్లోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార‌, సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న ప‌దం ఇదే. ఇంతగా పాపుల‌ర్ కావ‌డానికి కార‌ణం ఒకే ఒక్క‌డు . టీ – హ‌బ్‌కు జయేష్ రంజ‌న్ జీవం పోస్తే..చాకులాంటి కుర్రాడు జై కృష్ణ‌న్ దానిని ఓ ప్లాట్ ఫాం మీద‌కు తీసుకు రావ‌డంలో స‌క్సెస్ అయ్యాడు.

భ‌విష్య‌త్ ప‌ట్ల స‌డ‌ల‌ని న‌మ్మ‌కం. దేశ ఆర్థిక రంగాన్ని ప్ర‌భావితం చేసే ఐటీ దిగ్గ‌జాలు సైబ‌రాబాద్ వైపు చూసేలా చేశాడు. టీ – హ‌బ్‌కు జే కృష్ణ‌న్ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి. కేటీఆర్ తెలివి క‌లిగిన వ్య‌క్తి. ఓ మంత్రిగా కాకుండా ఐ యువ‌కుడిగా..ఫ్యూచ‌ర్ ప‌ట్ల కొంచెం ఆలోచ‌న వున్న మ‌నిషిగా ఆలోచించాడు. న‌ల్గురు దిగ్గ‌జాల‌ను ఎంపిక చేసుకున్నాడు. ఒక‌రు జ‌యేష్ రంజ‌న్ అయితే మ‌రొక‌రు జే కృష్ణ‌న్‌. ఇంకొక‌రు కొణ‌తం దిలీప్ రెడ్డి..టీ శాట్ సీఇఓ శైలేష్ రెడ్డి. ఇలా ఎవ‌రికి వారు త‌మ‌దైన రంగాల్లో పాతుకు పోయారు. ఆశించిన దానికంటే అధికంగా ఫ‌లితాల‌ను సాధిస్తూ దూసుకెళుతున్నారు.

అటు బెంగ‌ళూరు, చెన్నై, ఢిల్లీ న‌గ‌రాల‌ను దాటుకుంటూ వెళ్లేలా ట్రై చేస్తున్నారు. ఒక్క యూత్ కాకుండా వ‌య‌సును ప్రామాణికం తీసుకోకుండా డిఫ‌రెంట్ ఐడియాల‌తో వ‌చ్చే వాళ్ల‌కు టీ హ‌బ్ స‌హ‌కారం అందిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణ ఐటీ కొత్త‌పుంత‌లు తొక్క‌డం ఖాయం. హ్యాట్సాఫ్ జై కృష్ణ‌న్‌.

No comments