Header Ads

గాత్ర‌మా..గాంధ‌ర్వ గాన‌మా - ఆశా అల్విదా

కమ్మని స్వరం ఆమె సొంతం . ఏ సందర్భంలోనైనా తన గొంతును అవలీలగా పలికించే సత్తా కలిగిన ఆశా భోంస్లే శిఖరం అంచున నిలబడ్డారు . ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు . అక్క లత హవా కొనసాగుతున్న సమయంలో తనకంటూ ఓ గుర్తింపు కోసం ఆమె ఆర్త పడ్డారు . అహర్నిశలు శ్రమించారు. చెట్టంత ఎట్టు ఎదిగిన తన అక్క నీడన ఉంటే తనకేం గుర్తింపు ఉంటుందని తానే పాట ఎందుకు కాకూడదని ప్రయత్నం చేశారు . తానే సంగీత ప్రపంచమైంది . కోట్లాది అభిమానులను ఆశా సంపాదించుకుంది . వేలాది పాటలు పాడింది . మనల్ని వెంటాడేలా చేసింది . కళకు వయసు ఏ మాత్రం అడ్డంకి కాదని తనను తాను ప్రూవ్ చేసుకుంది . ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా అన్ని రకాల పాటలను అవలీలగా పాడింది . ఇంకా పాడుతూనే వుంది. అలుపన్నది బతుకే కానీ పాటల ప్రవాహానికి కాదని స్పష్టం చేసింది .1933 లో మహారాష్ట్రలోని శాంగ్లీలో జన్మించారు . చిన్నతనంలోనే ఎన్నో కస్టాలు . స్వంత అక్కతో విభేదాలు . దీంతో సొంత గొంతుకతో స్టార్ట్ చేశారు . ఆర్డీ బర్మన్ తో సహజీవనం చేశారు . పంచమ్ దాను కోల్పోయినప్పుడు ఆశా గొంతు మూగ బోయింది. పక్షులు ఎగిరిన చప్పుడు . ప్రవహించే నదిలా ఆమె తన గొంతుకు నగిషీలు చెక్కారు . తన సంగీతపు పాఠాలను 1943 లో ప్రారంభించారు . ఆ తర్వాత తనకు బాలీవుడ్ లో ఎదురు లేకుండా పోయింది . అటు సినిమాలు .. భజనలు , పాప్ , రాక్ , ఇలా అన్ని విభాగాల్లో .. పాటలు పాడి రికార్డులు సృష్టించారు . దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ౨౦ భాషల్లో తన గొంతును అరువిచ్చారు .

ఒక్క 2006 లో అత్యధికంగా పాటలు పాడిన గాయకురల్గా అరుదైన ఫీట్ సాధించారు ఆశా. ది వరల్డ్ రికార్డ్స్ అకాడెమీ ఆమెను ఘనంగా సత్కరించింది . ఫాల్కే , పద్మ భూషణ్ అవార్డులు పొందారు . 16 ఎల్లప్పుడు పెళ్లి చేసుకున్నారు . గీతాదాత్ , షంషాద్ బేగం , లతా ఒక వెలుగు వెలిగిపోతున్న తరుణంలో ఆశా బిక్కుబిక్కుమంటూ అడుగు పెట్టింది . మరో వైపు భర్త చేతిలో మోస పోవడంతో మానసికంగా అలసి పోయింది. అప్పుడే పాటతో ప్రయాణం మొదలు పెట్టింది . బి గ్రేడ్ సినిమాలకు పాడటం చేసింది . ఎందరో గేలి చేసినా భరించింది . 1952 లో ఆమె కెరీర్ ఓ మలుపు తిరిగింది . ఆశను బిమల్ రాయ్ ప్రమోట్ చేసాడు . పరిణీతలో బూట్ పాలిష్ సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు .

1956 లో ఒపి నయ్యర్ అయేషాకు బ్రేక్ ఇచ్చాడు . సిఐడి తో నయా చోర్ సినిమాలు మంచి పాపులారిటీని తెచ్చాయి . గం రాహ్ , వక్త్ , ఆద్మీ ఔర్ ఇన్సాన్ సినిమాలు ఆషాను నిల బెట్టాయి . సచిన్ దేవ్ బర్మన్ , రవి సంగీత దర్శకులు ఆశాకి అవకాశాలు ఇచ్చారు . 1966 లో రాహుల్ దేవ్ బర్మన్ రాకతో ఆశా కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది . తీసిరి మంజిల్ బాలీవుడ్ లో పెను సంచలనం సృష్టించింది . ఆ సినిమా దీదీకి మంచి పేరొచ్చింది . ఆజా ఆజా అంటూ లేత గొంతుతో వినిపించిన ఆ పాట దేశాన్ని ఊపేసింది . ఓ మేరీ సోనా అంటూ హాయిగా .. పిల్ల తెమ్మెరెలా పాడినా ఆ గొంతులోని మాధుర్యం వేలాది అభిమానులను సంపాదించుకుంది .

1960 నుండి 1970 దాకా వచ్చిన సినిమాల్లో ఎక్కు వ సినిమాలు ఆశా పాడినవే . 1981 లో ఆశా రేఖ కోసం పాడిన పాట హైలెట్ గా నిలిచింది . ఉమ్రావ్ జాన్ సినిమాలోని పాట ఇప్పటికి మారు మోగుతూనే ఉంటుంది . అవార్డు తెచ్చి పెట్టింది . 2001 లో అమీరేఖం నటించిన లగాన్ లో రాధ కైసే , ప్యార్ తూ నే క్యా కియా , ఇలా ఎన్నో పాటలు ఆశా గొంతు లోంచి జాలు వారాయి . ఒపి నయ్యర్ ఆమె కెరీర్ కు బాటలు వేస్తే బర్మన్ ఉన్నత శిఖరాలకు చేర్చాడు . ఇక రెహమాన్ సంగీతంలో వచ్చిన రంగీలా సినిమా ఓ ఊపు ఊపింది . యాహిరే యాహిరే జోరు లాగాకే నాచోరే ... ఓ సెన్షేషన్ బాలు తో కలిసి పాడిన సాగర్ సినిమాలోని ఓ మారియా పాట యిప్పటికి గొప్ప పాటగా మిగిలి పోతుంది .

గుల్జార్ తో కలిసి ఆశా ప్రైవేట్ ఆల్బమ్ లు పాడారు . దిల్ పాడాసి హాయ్ ఆల్బమ్ ఓ చరిత్ర సృష్టించింది . గ్రామీ అవార్డు దక్కింది . జానం .. పాటకు ఎంటీవీ అవార్డు వరించింది . పాక్ సింగర్ సమీతో కలిసి పాడిన ఆల్బమ్ రికార్డ్ వసూళ్లు చేసింది . వందలాది అవార్డులు , పురస్కారాలు అందుకున్నారు ఆశా .

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కాలం సరి పోదు . ఆశా పంచమ్ ల బంధం ఎన్నో కొత్త రాగాలను సృష్టించింది . ఈ లోకం ఉన్నంత దాకా .. పాట పదిలంగా ఉన్నంత దాకా .. ఆశా గాత్రం సమ్మోహనమై మనల్ని వెంటాడుతూనే ఉంటుంది . పరుగులు తీస్తూనే మన హృదయాలకు తన గాత్రంతో సేద తీరుస్తుంది .!

No comments