Header Ads

హిజ్రా పైన హత్యాయత్నం, అసలు విషయం తెలిస్తే బాధ పడతారు.!

"హిజ్రా లు అంటే కేవలం ట్రైన్ లలో షాప్ లలో డబ్బులు అడిగే వారు కాదు, వాళ్ళు కూడా కష్ట పడుతూ సంపాదిస్తారు అని చాలా మంది నిరూపించారు, చాలా మంది తమని చిన్న చూపు చూస్తారని, మౌనంగా ఉంటె తమని అపహేళన చేస్తూ ఉంటారని, అందరూ అపహేళన చేస్తుంటే బ్రతకడం చాలా కష్టంగా ఉంటుందని, అయినా కూడా చాలా మంది హిజ్రాలు కష్టపడి జీవితం లో పైకి వస్తారు. కొంత మంది డబ్బుల కోసం హిజ్రా వేషం వేసుకొని ట్రైన్ లలో షాప్ లలో జనాల్ని డబ్బులు ఇవ్వమని దబాయిస్తారు, నిజమైన హిజ్రాలు డబ్బుల కోసం జనాల్ని దబాయించరు " అని తెలిపారు హిజ్రా లలో ఒకరు.



అమ్మాయిలను మోసం చేసే వారి సంఖ్యా మన దేశం లో ఎక్కువే, కానీ హిజ్రా లను కూడా వదలట్లేదు కొందరు అబ్బాయిలు. ప్రేమ, పెళ్లి అంటూ మాటలు చెప్పి హిజ్రా లను నమ్మించి వారిని మోసం చేస్తున్నారు కొందరు. హిజ్రాల పైన ఈ మధ్య ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి, ప్రతి ఒక్క హిజ్రా జనాలను డబ్బుల కోసం వేధించారు, కొంత మంది మామూలుగా జీవించాలి అనుకుంటారు, ఉద్యోగం చేసో లేక వ్యాపారం పెట్టుకొనే బ్రతుకుతూ ఉంటారు. కానీ అలంటి వల్లనే ఎక్కువగా మీసం చేస్తున్నారు.. ఇటీవల ఒక హిజ్రా ని ప్రేమించి పెళ్లి చేసుకొని కట్నం కోసం వేధించి వదిలేసాడు, ఇంతలోనే ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది.

తెలంగాణ రాష్ట్రం లోని మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంజనాపురంకు చెందిన హిజ్రా రాధికకు సురేష్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. హిజ్రా అంటే మామూలు అమ్మాయిలా బతకవచ్చని భావించింది. సురేష్‌ను ఎంతగానో నమ్మింది. దీంతో సురేష్‌ అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ వచ్చింది. ఇలా 3 లక్షల రూపాయల డబ్బును సురేష్‌‌ను నమ్మి ఇచ్చింది రాధిక. హిజ్రాల వద్ద ఇంత డబ్బు ఉంటుందా అని అనుకున్న సురేష్‌ ఆమెను డబ్బుల కోసం హింసిస్తూ వచ్చాడు. దీంతో సురేష్‌ అసలు విషయం తెలుసుకుంది. సురేష్‌ను గట్టిగా నిలదీసింది. దీంతో సురేష్‌ ఆగ్రహంతో ఊగిపోతూ కత్తితో రాధికపై దాడికి దిగాడు. చావుబతుకుల మధ్య రాధిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. జనాలను వేధించి డబ్బులు తీసుకొనే హిజ్రాలు హాయిగా బ్రతుకుతున్నారని, సొంతంగా కష్ట పడి నిజాయితగా బ్రతుకుతున్న ఇలాంటి హిజ్రా లకు ఇలా జరగడం అన్యాయం అని చాలా మంది బాధ పడుతున్నారు.

No comments