Header Ads

ప్రభాస్ ఇంటి వ్యయం ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోతారు...ప్రభాస్ ఇంటి గురుంచి మీకు తెలియని షాకింగ్విషయాలు .?

బాహుబలి తో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు ప్రభాస్, తనకున్న అభిమానులు అమాంతం పెరిగిపోయారు, ఒకప్పుడు టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ప్రభాస్, ఇప్పుడు బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా తన సినిమాలని ఒకేసారి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు, సాహో తెలుగు, తమిళ్, హిందీ బాషలలో ఏకకాలం లో చిత్రీకరణ జరుపుకుంటుంది. సాహో తరువాత చేయబోయే చిత్రం కూడా తెలుగు, తమిళ్, హిందీ, బాషలలో రూపుదిద్దుకుంటుంది.




రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారి అన్నయ్య కొడుకుగా తెలుగు చిత్ర సీమ లోకి ఈశ్వర్ సినిమా తో అడుగు పెట్టిన ప్రభాస్, వర్షం సినిమా తో స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నాడు.ఆ తరువాత ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో తెలుగు టాప్ హీరోలలో ఒకరిగా మారిపోయాడు, బాహుబలి చిత్రం తరువాత యెనలేని క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ప్రభాస్ ఇల్లు ఎలా ఉంటుందో అని అభిమానులు అందరూ అనుకుంటూ ఉంటారు, ప్రభాస్ ఇల్లు జుబ్ల్లి హిల్స్ లోని పెద్దమ్మ గుడి వెనుక ఉంది, కృష్ణం రాజు ఇంటికి దగ్గరలోనే ప్రభాస్ ఇల్లు ఉంటుంది. ప్రభాస్ ఇంట్లో మొత్తం 5 బెడ్ రూమ్ లు,3 హాల్స్ ఉన్నాయ్. ప్రభాస్ ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్, మినీ హోమ్ థియేటర్, జిమ్, లైబ్రరీ ఉన్నాయ్. ప్రభాస్ ఇంటి ఖరీదు దాదాపు 30 కోట్ల పైనే ఉంటుందని సమాచారం. ప్రభాస్ ఖాళీ సమయంలో హైదరాబాద్ లో కంటే తన సొంత ఊరు అయిన భీమవరం దెగ్గర వున్న పల్లెటూరు లో నే తన బంధు మిత్రులతో కలిసి ఉంటాడు. ఇటీవలే 40 వ ఏట లో అడుగు పెట్టాడు ప్రభాస్.




పెళ్లి విషయం లో ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ప్రభాస్, అయితే అభిమానులు మాత్రం త్వరలోనే పెళ్లి గురుంచి ప్రకటన చేయబోతున్నాడు అని చెబుతున్నారు. సాహో చిత్రాన్ని 2019 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు, ప్రస్తుతానికి 65% వరకు చిత్రీకరణ పూర్తి అయ్యిందని నిర్మాతలు ప్రకటించారు. అక్టోబర్ 23 న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన సాహూ మూవీ మేకింగ్ వీడియో కి విశేషమైన ఆదరణ వచ్చింది. సాహో తో ఇంకెన్ని రికార్డు లు క్రీయేట్ చేస్తాడో చూడాలి

No comments