Header Ads

96 సంవత్సరాల వయసులో 98 మార్క్ లు సాధించి సంచలనం సృష్టించిన బామ్మ..గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీ.?

కేరళ లో అక్షరాస్యుల సంఖ్యా ఎక్కువే, ఇటీవల కేరళ ను వరదలు ముంచెత్తాయి, అయిన ఏ మాత్రం అత్త స్థైర్యాన్ని కోల్పోకుండా కేరళ ప్రభుత్వం ముందుకు సాగుతుంది, అందుకు ప్రజలు కూడా సహకరిస్తున్నారు. చదువుల రాష్ట్రంగా పేరొందిన కేరళలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు అక్కడి ప్రభుత్వం అక్ష‌ర లక్ష్యం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పధకం కి భారీ స్పందన వచ్చింది, ముఖ్యంగా వయసు పైబడిన వారి నుండి ఎక్కువ స్పందన వచ్చింది.
ఈ పథకం లో 96 సంవత్సరాలు వయసు గల ఒక వృద్దురాలు పాల్గొనింది, అలప్పుజా జిల్లాకు చెందిన కార్తియాని అమ్మ(96) అనే బామ్మ చదువు నేర్చుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమంలో చేరింది. ఈ కోర్సులో చేరిన వారికి చదవడం, రాయడంతో పాటు మ్యాథ్స్ కూడా నేర్పిస్తారు. ఇటీవలే ఆ కోర్సు పూర్తవడంతో వారందరికీ ఎగ్జామ్ పెట్టారు. 96 ఏళ్ల బామ్మ కూడా ఈ పరీక్ష రాయగా 100కు 98 మార్కులు సాధించింది. గురువారం(నవంబర్ 1) కేరళ సిఎం కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ఓ కారక్రమంలో రాష్ట్ర సిఎం పినరయి విజయన్ చేతుల మీదుగా ఆ బామ్మ మెరిట్ సర్టిఫికేట్ తీసుకుంది. ఆమె పట్టుదల ఎందరో యువకులకు స్ఫూర్తినిస్తుందని కేరళ సీఎం పేర్కొన్నారు, 96 సంవత్సరాల వయసుగల ఈ బామ్మనిజంగానే అందరికి స్ఫూర్తి దాయకం, ఆమె పట్టుదల, ఆకాంక్ష ని మాటల్లో వర్ణించలేం.

ఇలాంటి కార్యక్రమాల వలన ప్రజలకు మంచి జేరగడమే కాకుండా వాళ్ల ఆత్మ స్థైర్యాన్ని పెంచే విధముగా ఉంటాయి, కేరళ గవర్నమెంట్ చేపట్టిన ఈ పధకానికి దేశ నలుమూలల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే విధమైన పధకం ప్రవేశ ఎత్తాలని నెటిజెన్ లు కామెంట్ లు చేస్తున్నారు.

ఇలాంటి పధకం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి వీళ్ళైనంత త్వరగా అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇదే రకమైన పధకాన్ని అమలు పర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం ఈ పధకం దేశ వ్యాప్తంగా, స్వచ్ఛ్ భరత్ తరహా లో నిర్వహిస్తే ఇంకా మంచిదని అభిప్రాయపడుతున్నారు. దేశ నలుమూలల నుండి కేరళ సీఎం పైన ఇప్పుడు పొగడ్తల వర్షం కురుస్తుంది.

No comments