Header Ads

ఈ రోజు ధనత్రయోదశి, ఈ 9 వస్తువు ల్లో ఏదో ఒకటి కొంటే మీకన్నీ శుభాలే.!

దీపావ‌ళి వ‌స్తుంద‌న‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది ట‌పాసులు. పండుగ వారం ఉంద‌న‌గానే ఎవ‌రి ఇంట్లోనైనా ఈ సంద‌డే ఉంటుంది. ఇక పిల్ల‌లు ఉంటే వారు ట‌పాకాయలు కొనే దాకా పోరు పెడుతూనే ఉంటారు. పిల్ల‌లే కాదు, పెద్ద‌ల‌కు కూడా దీపావ‌ళి ట‌పాసులు కాల్చ‌డ‌మంటే అదో స‌ర‌దా. అయితే దీపావ‌ళి అంటే నిజంగా ట‌పాసులే కాదు, అదో దీపాల పండుగ‌. న‌ర‌కాసురున్ని వ‌ధించినందుకు గాను ప్ర‌జ‌లంతా సంతోషంతో జ‌రుపుకునే వేడుక అది. దీంతోపాటు చాలా మంది ఆ రోజున ల‌క్ష్మీ దేవిని కూడా పూజిస్తారు.




దీపావ‌ళికి ముందు రోజున వచ్చే ధనత్రయోదశి రోజున అంద‌రూ ల‌క్ష్మీ దేవికి పూజ‌లు చేస్తారు. అయితే ఈ ధనత్రయోదశి ఏటా దీపావ‌ళికి ముందు రోజే వ‌స్తుంది, కానీ ఈ సారి మాత్రం రెండు రోజుల ముందే వ‌స్తోంది. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఈ నెల 28వ తేదీన ధంతేర‌స్ రానుంది. ఈ క్ర‌మంలో ఆ రోజున ల‌క్ష్మీ దేవి పూజ‌తోపాటు ప‌లు వ‌స్తువుల‌ను కూడా కొనాల‌ట‌. దీంతో అలా కొనే వారికి ఇంకా ఎక్కువ శుభాలు క‌లుగుతాయ‌ట‌. ఆ రోజున ఏమేం వ‌స్తువులు కొంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

వంట‌పాత్ర‌లు:
ఇత్త‌డితో త‌యారు చేసిన వంట పాత్ర‌ల‌ను ధంతేర‌స్ రోజున కొనుగోలు చేసి వాటి ఇంట్లో తూర్పు దిక్కున ఉంచాలి. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది.

చీపురు:
ధంతేర‌స్ రోజున చీపురును కొనాలి. దీంతో ఆ ఇంట్లో ఉన్న వారికి ప‌ట్టిన ద‌రిద్రం పోతుంద‌ట‌.

ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు:
ఫ్రిజ్‌, మొబైల్ ఫోన్‌, టీవీ వంటి వ‌స్తువుల‌ను ధంతేర‌స్ రోజున కొనాల‌ట‌. అనంత‌రం వాటిని ఇంట్లో వాయువ్య దిశ‌గా ఉంచాలి. అలా చేస్తే అనుకున్న ప‌నులు జ‌రుగుతాయ‌ట‌.

అకౌంట్స్ బుక్‌:
వ్యాపారం చేసే వారు అకౌంట్స్ పుస్త‌కాన్ని (రిజిస్ట‌ర్‌) కొనుగోలు చేసి దాన్ని వారి షాపులో లేదా ఆఫీసులో ప‌డ‌మ‌ర దిశ‌గా ఉంచాలి. దీంతో వ్యాపారం వృద్ధి చెందుతుంది.

చేసే వృత్తికి సంబంధించిన‌వి:
ఎవ‌రు ఏ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా వాటికి సంబంధించిన ఏదో ఒక వ‌స్తువును ధంతేర‌స్ రోజున కొనుగోలు చేసి ల‌క్ష్మీ దేవిని పూజించాల‌ట‌. దీంతో వారికి ఆ రంగంలో విజ‌యం చేకూరుతుంది.

గోమ‌తి చ‌క్ర‌:
గోమ‌తి చ‌క్ర అనే పేరున్న 11 గ‌వ్వ‌ల‌ను కొనుగోలు చేసి వాటిని ఒక ప‌సుపు రంగు వ‌స్త్రంలో చుట్టి మీ ఇంట్లోని లాక‌ర్‌లో పెట్టాలి. దీంతో సంప‌ద క‌లుగుతుంది.

ల‌క్ష్మీ దేవి, వినాయ‌కుడు:
ధంతేర‌స్ రోజున ల‌క్ష్మీదేవి, వినాయ‌కుడు క‌ల‌సి ఉన్న ఫొటోను లేదా గోల్డ్ కాయిన్‌ను ఇంటికి తెచ్చుకుని వాటికి పూజ చేయాలి. దీంతో ఆ ఇంట్లో అన్నీ శుభాలే జ‌రుగుతాయి. సంప‌ద కూడా వృద్ధి చెందుతుంది.

స్వ‌స్తిక్ చిహ్నం:
స్వ‌స్తిక్ బొమ్మ‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం లేదా గేట్ వ‌ద్ద వేలాడ దీయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో వారికి అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది.

బంగారం:
ధనత్రయోదశి రోజున వీలైతే బంగారం కూడా కొన‌వ‌చ్చు. దానికి ఇంత ప‌రిమితి అని లేదు. ఎంత త‌క్కువ కొన్నా ఆ రోజు బంగారం కొంటే మంచి జ‌రుగుతుంద‌ట‌. ఉద‌యం 6.34 గంట‌ల‌కు, సాయంత్రం 6.20 గంట‌ల‌కు బంగారం కొనేందుకు మంచి ముహూర్తాలు ఉన్నాయ‌ట‌.

No comments