కుంకుడు కాయలు కేవలం జుట్టుకే కాదు..! ఈ 6 రకాలుగా కూడా ఉపయోగించొచ్చు తెలుసా.? ట్రై చేయండి!
శిరోజాలకు వన్నె తేవడంలో, వెంట్రుకలను దృఢంగా, ఒత్తుగా మార్చడంలో కుంకుడు కాయలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మన పెద్దలు ఒకప్పుడు షాంపూలకు బదులుగా కుంకుడు కాయలతో తీసిన రసాన్నే తమ జుట్టుకు పెట్టుకుని తలస్నానం చేసే వారు. దీంతో వారి కేశాలు ఒత్తుగా, దృఢంగా ఉండేవి. కానీ కుంకుడు కాయలను మనం మరిచిపోయాం. అయితే ఈ విషయం పక్కన బెడితే అసలు కుంకుడు కాయలతో మనకు కేవలం శిరోజాల సౌందర్యం మాత్రమే కాకుండా పలు ఇతర లాభాలు కూడా కలుగుతాయి. వాటిని మనం పలు అవసరాలకు వాడుకోవచ్చు. మరి కుంకుడు కాయలతో ఉన్న ఇతర ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
కుంకుడు కాయ ద్రవం తయారీ ఇలా…
ఒక గిన్నెలో 12 నుండి 15 కుంకుడుకాయలు తీసుకోవాలి. ఆ గిన్నెలో 6 కప్పుల నీరు పోయాలి. దాన్ని బాగా మరిగించాలి. ఒక గంట పాటు తక్కువ మంటలో మరిగించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా రాత్రి మొత్తం అలా వదిలేయాలి. ఆ తర్వాత రోజు ఉదయం అందులో ఉన్న కుంకుడు కాయ నీటిని అంతా వడకట్టి, గాలిదూరని పాత్రలో వేసి మూతపెట్టాలి. ఇందులో ఎటువంటి సంరక్షణకారులను వేయలేదు కాబట్టి, ఈ ద్రవం ఒక వారంలో చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ద్రవంలో కొంత నిమ్మకాయ రసం పిండితే ఆ ద్రవం ఎక్కువ రోజుల పాటు ఉన్నా చెడిపోకుండా ఉంటుంది.
కుంకుడు కాయ ద్రవంతో ఉన్న లాభాలు.
1. ఒక స్ప్రే బాటిల్ లో పావు లీటర్ నీటిని తీసుకోవాలి. దీనికి 15 ml కుంకుడు కాయ ద్రవం, 15 ml వెనిగర్ ని కలపాలి. ఈ మిశ్రమాన్ని కిటికీలు, ఇంట్లో ఫ్లోర్, ఇతర వస్తువులపై స్ప్రే చేసి అనంతరం పొడిగుడ్డతో ఆ ప్రదేశాలను తుడవాలి. దీంతో ఆయా ప్రదేశాలు మెరుస్తాయి. మురికి పోతుంది. అవి శుభ్రంగా ఉంటాయి.
2. బంగారు ఆభరణాలను శుభ్ర పరిచేందుకు కుండుకు కాయ ద్రవం బాగా పనికొస్తుంది. కుంకుడు కాయ ద్రవంలో బంగారు ఆభరణాలను నానబెట్టాలి. అనంతరం వాటిని తీసి మెత్తని బ్రష్‌తో నగలను క్లీన్ చేయాలి. అనంతరం మంచి నీటితో నగలను కడిగేయాలి. దీంతో నగలు మెరుస్తాయి.
3. కుంకుడు కాయ ద్రవాన్ని హ్యాండ్ వాష్ గా కూడా ఉపయోగించవచ్చు. దాంతో చేతులను కడుక్కుంటే క్రిములు చనిపోతాయి. చేతులు సువాసన వస్తాయి.
4. ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులను కుంకుడు కాయ ద్రవంతో శుభ్రం చేయవచ్చు. ఆ ద్రవంతో వాటికి స్నానం చేయిస్తే వాటి శరీరంపై సూక్ష్మ క్రిములు ఉండవు.
5. కార్పెట్‌పై మరకలు పడితే వాటిపై కుంకుడు కాయ ద్రవాన్ని చల్లి అనంతరం బ్రష్ తో మరకలను క్లీన్ చేయాలి. దీంతో కార్పెట్లపై పడే మరకలు పోతాయి.
6. కార్లు, ద్విచక్ర వాహనాలను కుంకుడు కాయ ద్రవంతో క్లీన్ చేయవచ్చు. దీంతో అవి తళ తళా కొత్త వాటి వలె మెరుస్తాయి.
Post a Comment