Header Ads

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో రూ. 31,445 ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీస్. !

ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫైన్స్ వేస్తారు, అది సహజమే, కానీ 30,000 /- ,ఫైన్ ఉందని ఎప్పుడైనా విన్నారా? ఔను, ఒక వ్యక్తికి రూ. 31,445 ఫైన్ వేశారు, ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోతే రూ. 31,445 ఫైన్ వేస్తారా? ఒక సరి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఆ వాహనం పైన 135 ట్రాఫిక్ ఉల్లంగిత చర్యల కేసు లు నమోదు అయ్యాయి వివరాలొక్కి వెల్తే నారాయణగూడ ట్రాఫిక్‌ పీఎస్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న కృష్ణంరాజు గురువారం సాయంత్రం విధి నిర్వహణలో భాగంగా హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌లో సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఓల్డ్‌ అల్వాల్‌కు చెందిన కృష్ణప్రకాష్‌ హెల్మెట్‌ లేకుండా బైక్‌(టీఎస్‌10 ఇడి 9176)పై వెళుతుండగా పట్టుకున్నారు. చలానాల చిట్టా పరిశీలించగా వాహనంపై 135 ఉన్నాయి. జరిమానా మొత్తం రూ. 31,445. అతడిపై కేసు నమోదు చేసి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.




రెండు నెలల క్రితం ఏపీ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి వాహనంపై ఏకంగా 40కి పైగా ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంగించాడు, ఈ రెండింటిని ఒకే ట్రాఫిక్‌ ఎస్‌ఐ గుర్తించడం విశేషం. అసలు ట్రాఫిక్ ని ఉల్లంఘించే వారికి సంఖ్యా రోజు రోజుకి ఘననీయంగా పెరిగిపోతుంది. హెల్మెట్ ధారణ నుండి త్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంప్ అంటూ మొదలగు ట్రాఫిక్ కేసు ల సంఖ్యా పెరుగుతూనే ఉంది, కానీ రూ. 31,445 అంటేనే ఆశ్చర్యంగా ఉంది, అతగాడిని తలుచుకుంటేనే జాలి వేస్తుంది.

ట్రాఫిక్ రూల్స్ పాటించమనేది మన జాగ్రత్త కోసమే, ఫైన్స్ భయం తో అయినా సక్రమంగా నడుపుతారు అని ఫైన్స్ డబ్బులు పెంచినా, జనాల్లో ఎటువంటి మార్పు కనిపియ్యడం లేదు. ఒక ద్విచక్ర వాహనం మీద త్రీ నుండి మొదలు  వరకు ప్రయాణిస్తూ ఉంటారు. ఇక కారులో వేగా వంతం గా వెళ్లడం, మద్యం సేవించి బండి నడపడం వంటివి జరుగుతూనే ఉన్నాయ్, పట్టణాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది, సిటీల్లో పోలీస్ ఉంటారని భయం తో కొంత మేరకు తప్పులు తగ్గుతాయి, కానీ పట్టణాల్లో హెల్మెట్ ధారణ వరకు అతి వేగం,ఇలా ఎన్నో చేస్తూనే ఉన్నారు, అప్పుడప్పుడు పట్టించుకున్న, ఎక్కువ శాతం తప్పులు జరుగుతూనే ఉంటాయి పట్టణాల్లో.

No comments