Header Ads

3 వ తరగతి అమ్మాయి…పేద విద్యార్థుల కోసం సొంతంగా లైబ్రరీ నడుపుతోంది.

ఆ అమ్మాయి పేరు ముస్కాన్..బీహార్ లోని ఓ స్లమ్ ఏరియాలోని స్కూల్ లో మూడవ తరగతి చదువుతుంది. స్కూల్ కాగానే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది…వచ్చీ రావడం తోనే తన ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని ఊడ్చి తన ఇంట్లోని చాపను తెచ్చి పరిచింది…ఒక్కొక్కరుగా బస్తీ పిల్లలందరూ అక్కడి రావడం ముస్కాన్ పరిచిన చాప మీద కూర్చోవడం ప్రారంభించారు..కొద్దిసేపటికే ఆ చాప పిల్లలతో నిండిపోయింది. అందరూ రాగానే ఇంట్లోకి వెళ్లిన ముస్కాన్ ఓ పెట్టె లోని పుస్తకాలు తీసుకొచ్చి ఒక్కొక్కరికీ ఒక్కో పుస్తకాన్ని అందిచింది.




ఎవరిలో వారే చదువుకోవడం స్టార్ట్ చేశారు. ఓ అర్థగంట తర్వాత.ఒక్కొక్కరుగా తాము చదివిన పుస్తకంలో తమకు నచ్చిన అంశాన్నిఅందరికీ చెబుతున్నారు. అలా అందరూ ఆ రోజు కొన్ని విషయాలపై చర్చించిన తర్వాత ఆ పుస్తకాలన్నీ తిరిగి ముస్కాన్ కు ఇచ్చేశారు. పుస్తకాలన్నింటిని సేకరించిన ముస్కాన్ మళ్లీ వాటిని భద్రంగా పెట్టెలో పెట్టేసింది.

తీరా.ఆరా తీస్తే తెలిసిందేంటంటే…అది వారికి ఓ లైబ్రరీ లాంటిదన్నమాట. మూడవ తరగతి చదువుతున్న ముస్కాన్ ఆ లైబ్రరీ నిర్వాహకురాలంట.! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అన్నట్టు మరిచా ఈ లైబ్రరీకి ఏ పేరు “బాల్య పుస్తకాలయ్”. స్కూల్ అవ్వగానే ఇక్కడ చదువు చర్చ కొనసాగుతుంది.

ఈ లైబ్రరీ వెనకాల పెద్ద స్టోరినే ఉంది. 2015 లో అక్కడి పాఠశాల అధికారులు స్లమ్ ఏరియాలోని పిల్లలలో చదువు పట్ల ఆసక్తిని పెంచడానికి ముస్కాన్ కు కొన్ని పుస్తాకాలిచ్చి వాటిని ఇతరులకు కూడా ఇచ్చి చదివించమని చెప్పారు. తర్వాత వచ్చి చూస్తే పుస్తకాలు ఇవ్వడమే కాదు ఓ మినీ లైబ్రరీనే ఏర్పాటు చేసింది ముస్కాన్. ప్రస్తుతం ఈ లైబ్రరీలో 200లకు పైగా మంచి మంచి కథల పుస్తకాలున్నాయ్.

చదవుకునే టైం లో ఎవరికి డౌట్ వచ్చినా …ఆ డౌట్ ముస్కాన్ ను అడుగుతారు. తెలిస్తే చెబుతుంది. తెలియకపోతే దానిని నోట్ చేసుకొని స్కూల్ లో వాళ్ల టీచర్స్ ను కనుక్కొని మరీ చెబుతుంది ముస్కాన్. ఇంత చిన్న వయస్సులోనే ఇంత సేవ చేస్తున్న ముస్కాన్ ను మనస్పూర్తిగా అభినందిద్దాం.

No comments