Header Ads

28-11-2018 రోజువారీ రాశిఫలాలు.ఏ రాసి వారికీ బాగుందో చూసుకోండి.?

మేషం :

ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఊహించని ఖర్చులు మీ అంచనాలను దాటుట వలన ఆందోళనలకు గురవుతారు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రయాణాలలో మెళకువ అవసరం.
వృషభం :

గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రేమికుల మధ్య చికాకులు తలెత్తుతాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మంచి పేరు ఖ్యాతి లభిస్తుంది.

మిథునం :

మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయే అవకాశం ఉంది. ప్రముఖుల పరిచయాలు మీ ఉన్నతికి నాంది పలుకుతాయి. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం.

కర్కాటకం :

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయే అవకాశం ఉంది. వృత్తులలో తోటి వారితో అభిప్రాయ భేదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు పాటించండి. మీ మంచి కోరుకునే వారి కంటే చెడు కోరుకునే వారే ఎక్కువగా ఉన్నారు. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి.

సింహం :

దంపతుల మధ్య ప్రేమానుబంధం బలపడుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులు విసుగు కలిగిస్తాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఎదుటి వారితో మితంగా సంభాషిచటం మంచిది. ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది.

కన్య :

కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఆశయసాధన కోసం అవిశ్రాంతంగా శ్రమిచవలసి ఉంటుంది. స్త్రీలు పనివారలతో చికాకులను ఎదుర్కుంటారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది.

తుల :

మీరు చేపట్టిన పనులకు ఇతరుల నుంచి అవాంతరాలు ఎదుర్కుంటారు. ఆర్థిక లావాదేవీలు, వ్యాపార వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకుసాగవు. గృహాలంకరణ నిమిత్తం సద్వ్యయం చేస్తారు. పాత బాకీలు తీరుస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంఘంలో మంచి పేరు ఖ్యాతి లభిస్తుంది.

వృశ్చికం :

ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. బంధువులతో మీ సత్ సంబంధాలు బలపడుతాయి. ఇతరుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. కొంత ఆలస్యమైనా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశాజనకం. అపనిందలు పడే పరిస్థితులున్నాయి జాగ్రత్త వహించండి.

ధనుస్సు :

వృత్తి, వ్యాపారాల్లో అనుకూలం. హోటల్ తినుబండారాల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యులతో సంభాషించేటప్పుడు ఆచి తూచి వ్యవహరించటం మంచిది. దైనందిన కార్యక్రమాలలో మార్పుండదు. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

మకరం :

మీ జీవితభాగస్వామి వ్యవహారాల్లో శుభపరిణామాలు సంభవం. రవాణ రంగంలోని వారికి చికాకులు తప్పదు. మీ వ్యక్తిగత భావాలను, సమస్యలను బయటికి వ్యక్తం చేయకండి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉపాథి పథకాలు కలిసివస్తాయి.

కుంభం :

దీర్ఘకాలిక పెట్టుబడులు, గృహ నిర్మణాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఒక విషయంలో మిత్రులపై ఉంచిన నమ్మకం సన్నగిల్లుతుంది. ఆత్మీయుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి.

మీనం :

స్త్రీలకు బంధువులతో పట్టింపులు అధికమవుతాయి. దైవ, సేవ, పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రేమికులకు సన్నిహితుల ప్రోత్సాంహం లభిస్తుంది. పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. మత్స్య, కోళ్ల, గొర్రెల వ్యాపారస్తులకు సమస్యలు తప్పవు.

No comments