Header Ads

25 సంవత్సరాల వయసులో చనిపోవాలి అనుకున్న- ఎ.ఆర్‌. రెహమాన్‌.!

ఎ.ఆర్‌. రెహమాన్‌--సంగీత ప్రియులకు ఎంతో ఇష్టమైన వ్యక్తి, ఆస్కార్ అవార్డు అందుకున్న ఏకైక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్‌. రెహమాన్‌.... రెహమాన్‌ అంటే పడి సచ్చిపోయే వాళ్లు ఎంతో మంది ఉన్నారు, కానీ రెహమాన్‌ ఒకప్పుడు చావాలనుకున్నాడు, నమ్మశక్యం కావట్లేదా.


‘‘నాకు 25 సంవత్సరాలు వచ్చేవరకూ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వెంటాడుతుండేవి. ఎవరికి వారు మనం ఎందుకూ పనికిరాం అని అనుకోవడం వల్లే ఇలాంటి ఆలోచనలు వస్తాయనిపించేది. నాన్నను కోల్పోవడంతో ఒక్కసారిగా జీవితం శూన్యంగా మారిపోయింది. నా తండ్రి మరణం నాలో భయాన్ని పోగొట్టింది. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. కానీ చావు మాత్రం ప్రతి మనిషికి కచ్చితంగా వస్తుంది. అలాంటప్పుడు చావుకు ఎందుకు భయపడాలి? అన్న ఆలోచన నాలో ధైర్యం నింపింది’’ అని సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ అన్నారు. ఆయన జీవితం ఆధారంగా కృష్ణ త్రిలోక్‌ రాసిన ‘నోట్స్‌ ఆఫ్‌ ఎ డ్రీమ్‌: ది ఆథరైజ్డ్‌ బయోగ్రఫీ ఆఫ్‌ ఏఆర్‌ రెహమాన్‌’ని శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రెహమాన్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘నాన్న మరణించే క్షణం వరకూ పనిచేస్తూనే ఉన్నారు. నా దగ్గరకు 35 సినిమాల అవకాశాలు వస్తే వాటిలో నేను రెండే సినిమాలకు సంగీతం అందించా. నా పద్దతి చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అవకాశాలు వస్తున్నప్పుడు వినియోగించుకోవాలి.


వచ్చిన అవకాశాల్ని వదిలేసుకుంటే ‘ఎలా జీవిస్తావు’? అని చాలామంది అనేవారు. 25 ఏళ్ల వయసులో వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకోలేను. అలా చేేస్త జీవితానికి సరిపడా తిండి ఒకేసారి తిన్నట్లు అవుతుంది. అందుకే కొంచెం కొంచెం తింటూ మందుకెళ్లాలనుకున్నా. 22 ఏళ్లలోపు నా చదువును పూర్తిచేేసశా. అందరూ చేసే పనులు చేయకూడదు అనుకున్నాను. అందుకే ‘రోజా’ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాను. ఆ సమయంలో నా కుటుంబం ఇస్లాం మతానికి మారింది. నా అసలు పేరు దిలీప్‌ కుమార్‌. మతంలోకి మారాక పాత జ్ఞాపకాలన్నీ వదిలేశా. నా అసలు పేరంటే నాకు అస్సలు ఇష్టం ఉండేదికాదు. ఎందుకు ఇష్టంలేదో కూడా ఇప్పటికీ అర్థంకాదు. నా వ్యక్తిత్వానికి ఆ పేరు సూట్‌ కాదని అనిపించింది. మన మనసు చెప్పేది వినాలని నేను నమ్ముతా. అలా చేసుకుంటూనే సంగీత రంగంలో ఎదిగా. నాలో మార్పు రావడానికి సంగీతమే కారణం’’ అని తెలిపారు. రెహమాన్ ప్రస్తుతం విజయ్ నటించిన సర్కార్ మరియు 2.0 చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.ఈ రెండు చిత్రాలు నవంబర్ నెలలోనే విడుదల కానున్నాయి. రెహమాన్ మరెన్నో గొప్ప సినిమాలకి సంగీతం అందియాలని, ఇంకెన్నో గొప్ప గొప్ప అవార్డ్స్ గెలుచుకోవాలని సంగీత అభిమానులు కోరుకుంటున్నారు .

No comments