24 కిస్సెస్ మూవీ ..రివ్యూ రేటింగ్..?
Movie Title : (చిత్రం): 24 కిస్సెస్
Cast & Crew: నటీనటులు: హెబ్బాహ్ పటేల్, అదిత్ అరుణ్, నరేష్, రావు రమేష్
Cast & Crew: నటీనటులు: హెబ్బాహ్ పటేల్, అదిత్ అరుణ్, నరేష్, రావు రమేష్
- సంగీతం: జోయ్
- సినిమాటోగ్రఫీ: ఉదయ్
- నిర్మాతలు: సంజయ్ రెడ్డి
- దర్శకత్వం: అయోధ్య కుమార్
Story:
హీరో ఆనంద్( అదిత్ అరుణ్) చిన్న పిల్లోల్ల సినిమా లు తీస్తూ ఉంటాడు, తనకి పెళ్లి అంటే ఇష్టం ఉండదు, తనకు శ్రీ లక్ష్మి( హెబ్బాహ్ పటేల్) కి ఎఫైర్ ఉంటుంది, శ్రీ లక్ష్మి అంటే ఇష్టమే, కానీ పెళ్లి అంటే ఇష్టం లేదు అంటదు ఆనంద్. ఆనంద్, శ్రీ లక్ష్మి మధ్య ఉంటె కొట్లాటలు, లేకుంటే రొమాన్స్. ఆనంద్ చర్యలతో విసుగెత్తిపోయిన శ్రీ లక్ష్మి, ఆనంద్ తో విడిపోతుంది. శ్రీ లక్ష్మి లేకుండా బ్రతకలేను అని తెలుసుకుంటాడు ఆనంద్, చివరికి శ్రీ లక్ష్మి ని మరల తన ప్రేమలో పడేశాడా లేదా అనేది మిగిలిన కథ.
Plus Points: అదిత్ అరుణ్, హెబ్బాహ్ పటేల్, నరేష్ పాత్రలు
Minus Points: స్టోరి, స్కీన్ ప్లే, సంగీతం
Final Verdict: 24 కిస్సెస్ లో చెప్పుకోడానికి 24 కిస్సెస్ ఏ మిగిలాయి.
Rating: 2.0 / 5
ఇతర అంశాలు:
హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది, అదిత్ అరుణ్, హెబ్బాహ్ పటేల్ తమ తమ రోల్స్ లో బాగా చేసారు, నరేష్ క్యారెక్టర్ హైలైట్. క్లైమాక్స్ లో మెసేజ్. ఈ మధ్య కాలం లో రావు రమేష్ చేసిన క్యారెక్టర్స్ లో ఈ సినిమా లో వేసిన క్యారెక్టర్ చాలా చికాకు తెప్పిస్తుంది, రావు రమేష్ ని సరిగ్గా వాడుకోలేక పోయాడు డైరెక్టర్. ఒక చిన్న లైన్ ని పట్టుకొని సినిమా ని లాగాలి అనుకోవడం కష్టం, మిణుగురులు లాంటి అవార్డు విన్నింగ్ సినిమా తీసిన అయోధ కుమార్, 24 కిస్సెస్ సినిమా ను హ్యాండిల్ చేయడం లో విఫలమయ్యాడు అనే చెప్పవచ్చు.
Post a Comment