Header Ads

24 కిస్సెస్ చిత్రం రగడ ముదిరి రచ్చ బండ వరకు వచ్చింది.ఇంతకీ ఎం జరిగింది అంటే..?

'24 కిస్సెస్' మూవీ. సోషల్ మీడియా లో ప్రస్తుతం రచ్చ లేపుతున్న మూవీ. హెబ్బాహ్ పటేల్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో 24 కిస్ సీన్స్ ఉన్నాయ్ చాలా మంది అభ్యన్తరం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్, 24 కిస్సెస్ టీం మెంబెర్స్ ని మరియు, 24 కిస్సెస్ సినిమాను వ్యతిరేకించే జనాలను ఒక డిబేట్ లో తోసాడు.




హెబ్బాహ్ 24 కిస్ లేనా లేక 240 కిస్ లు పెట్టావా?

సినిమా లో 24 కిస్ లే పెట్టావా లేక 240 అంటూ జాఫర్ అడిగిన ప్రశ్నకి హెబ్బాహ్ సమాధానమిస్తూ డైరెక్టర్ కె తెలియాలి, డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాం, అది కూడా మా పరిధిలోనే చేస్తాం. ఏది చేసిన కేవలం యాక్టింగ్ ఏ. మేము సినిమాల్లో చేసేది అంత నిజం కాదు. సినిమా ని సినిమా లాగానే చూడాలి. 24 కిస్సెస్ సినిమాలో కేవలం ముద్దు సన్నివేశాలే కాదు, సినిమాలో మంచి సందేశం కూడా ఉంది. అందుకనే నేను 24 కిస్సెస్ సినిమా చేయడానికి ఒప్పుకున్నా అని తెలిపింది హెబ్బాహ్.

24 కిస్సెస్ మూవీ దర్శకుడు మాట్లాడుతూ, ఇంతక ముందు నేను మిణుగురులు అనే మూవీ తీసాను అంధుల మీద తీసిన ఆ సినిమా కి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఈ సినిమా లో ముద్దు సన్నివేశాలే కాకుండా వేరే అంశాలు చాలా ఉన్నాయ్. సమాజానికి మెసేజ్ ఇచ్చే అంశాలు చాలా ఉన్నాయ్ ఈ సినిమా. సినిమా చూడకుండానే మీరు వ్యతిరేకత వ్యక్తం చేయడం చాలా తప్పు అని చెప్పాడు.

RX 100 సినిమా దర్శకుడు కూడా ఈ డిబేట్ లో పాల్గొన్నాడు. 'ఏ' సర్టిఫికేటాయి సినిమాలు అంటే కేవలం 18+ వయసుగల వాళ్లు మాత్రమే చూడాలి, 18+ వయసుగల వాళ్ళకి ఆలోచించే శక్తి సొంతంగా నిర్ణయాలు తీసుకొనే అవగాహన ఉంటుంది. మేము ఏదో ముద్దు సీన్ లు, రొమాంటిక్ సీన్ లు చూపిస్తేనే వాళ్ళు రెచ్చిపోతారు అనడానికి లేదు, ఎందుకంటె 18+ జనాలు అంత పిచ్చోళ్ళు కాదని చెప్పుకొచ్చాడు.

మూవీ వర్గాల వారికి, వాటిని తప్పు పట్టే వాళ్ళకి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. సెన్సార్ సభ్యులు కూడా సినిమా ని సినిమా లాగే చూడాలి అంటూ సూచించారు. 24 కిస్సెస్ సినిమా నవంబర్ 22 న రిలీజ్ కానుంది. 24 కిస్సెస్ సినిమా కె ఇలా ఉంటె ఇంక 7 చేపల కథ సినిమా రిలీజ్ అప్పుడు ఏ రేంజ్ లో వేడెక్కిపోదో.. తలుచుకుంటేనే భయం వేస్తుంది.

Watch Video:

https://youtu.be/v0I09jJxftY?list=PLlRkq6AzK4ZTJ_yZ23b0S_CDa9PtR-మోయాబు

No comments