Header Ads

24 -11 -2018 రాసి ఫలాలు ఏ రాసి వాళ్ళకి బాగుందో చూడండి.?

మేషం

ఊహించని విధంగా పనులు పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహం, వాహనాలను కొనుగోలు చేస్తారు.



వృషభం

పాతమిత్రుల నుంచి అందిన ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలే శ్రేయస్కరం. సంతానం నూతన అవకాశాలు పొందుతారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నూతన కాంట్రాక్టులు లాభిస్తాయి.

మిథునం

వివాదాలకు దూరంగా ఉండడం అన్నివిధాలా మంచిది. ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. జీవితభాగాస్వామి నుంచి ధనలాభం పొందుతారు.

కర్కాటకం

ఉద్యోగులకు ఊహించని బాధ్యతలు చికాకులు పెట్టినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సోదరుల నుంచి సాయం అందుకుంటారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. వాహనాలు కొనుగోలు చేస్తారు.

సింహం

ఆర్థికపరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. స్థలాలు కొనుగోలు చేస్తారు.

కన్య

సంతానానికి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల నుంచి అందిన ఆహ్వానాలతో సంతోషం కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

తుల

ఆర్ధిక లావాదేవీలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చికం

కుటుంబంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. శ్రమానంతరం కాంట్రాక్టులు దక్కుతాయి. విలువైన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు

నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. భూవివాదాలు తీరి లబ్ది పొందుతారు.

మకరం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. రుణ ఒత్తిడులు ఎదురై చికాకులు పెట్టినా సోదరుల సాయం పొందుతారు. జీవితభాగస్వామి నుంచి ఆస్థిలాభం పొందుతారు.

కుంభం 

ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని ఆహ్వానాల వల్ల ఆనందం కలుగుతుంది. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. స్థలాలు, గృహం కొనుగోలు చేస్తారు.

మీనం

బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగిపోతాయి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

No comments