Header Ads

బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న 2.0 ! కొత్త రికార్డ్స్.!!

బ్లాక్ బస్టర్ టాక్ తో 2.0 సినిమా దూసుకుపోతుంది, అమెరికా లో ప్రీమియర్స్ మొదలు, ఇండియా లో ఫ్యాన్స్ షోస్ కంప్లీట్ అయ్యాక అందరి నోటా ఒకటే మాట బ్లాక్ బస్టర్. తమిళ్ నాడు లోనే కాదు, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా లో కూడా 2.0 చిత్రం కొత్త రికార్డ్స్ ని సృష్టిస్తుందని అందరూ భావిస్తున్నారు, బాహుబలి-2 రికార్డ్స్ ని అధిగమించ గల సత్తా కేవలం 2.0 కి మాత్రమే ఉంది.



సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య పాత్ర పోషిస్తున్న 2.0 చిత్రానికి దిగ్గజ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్ 2.0 చిత్రం లో విలన్ గా నటించాడు. అమీ జాక్సన్ ఇందులో లేడీ రోబో గా నటించింది. ఏ.ఆర్.రెహమాన్ 2.0 సినిమాకి సంగీతం అందించాడు.


బాహుబలి-2 సినిమాతో భారతీయ చలన చిత్ర రికార్డ్స్ ని బాధలు కొట్టారు ప్రభాస్-రాజమౌళి. ఇపుడు రజిని-శంకర్ ల వంతు వచ్చింది, సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ కలిసి ఒకే చిత్రం లో నటిస్తారని ఎవరు అనుకోలేదు. ఈ సినిమా తో అక్షయ్ కుమార్ నార్త్ లోనే 300 కోట్ల మార్కెట్ ని అందుకుంటాడు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి, ఇక తమిళ్ నాడు కంటే తెలుగు రాష్ట్రాల్లోనే 2.0 చిత్రానికి ఎక్కువ ఆదరణ లభించింది, తెలుగు ప్రేక్షకులకు రజినీకాంత్, శంకర్ అంటే ఎంత ప్రేమ ఉందొ అర్ధం అవుతుంది.

ఈ సినిమా ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనేది ఇప్పట్లో చెప్పలేము, ఎందుకంటె రానున్న కాలం లో ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషల్లో లో కూడా ఈ సినిమా  విడుదల కానుండటం తో, కచ్చితంగా బాహుబలి-2, దంగల్ ప్రపంచ వ్యాప్తంగా నెలకొలిపిన రికార్డ్స్ ని 2.0 దాటి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో 2500CR పైగా కలెక్షన్స్ సాధిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

500 కోట్ల భారీ బడ్జెట్ తో 2.0 సినిమా ను నిర్మించారు. తెలుగు లో సుమారు 75 కోట్లకి 2.0 చిత్రాన్ని కొన్నట్టు సమాచారం. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి నగరాల్లో 2.0 చిత్ర టికెట్స్ దొరకడం కష్టం అయిపోయాయి.

No comments