Header Ads

రికార్డు స్థాయి లో 2.0 చిత్ర విడుదల. రిలీజ్ కి ముందే అమెరికా లో రికార్డు. బద్దలు కొట్టేసింది.?

అమెరికా లో భారీ ఎత్తులో విడుదల అవుతున్న '2.0' చిత్రం. భారత దేశ చలన చిత్రాల్లో అమెరికా లో అత్యధిక థియేటర్ లలో విడుదల అవుతున్న చిత్రం 2.0, బాహుబలి -2 కంటే ఎక్కువ థియేటర్ లలో 2.0 చిత్రం విడుదల అవుతుంది. దీపావళి కానుకగా విడుదల అయిన 'తగ్స్ అఫ్ హిందుస్తాన్' సినిమా అందరిని నిరాశ పరిచింది. ఇక అందరి చూపు 2.0 చిత్రం పైనే ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య పాత్రా పోషిస్తున్న 2.0 చిత్రానికి దిగ్గజ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్ 2.0 చిత్రం లో విలన్ గా నటించాడు. అమీ జాక్సన్ ఇందులో లేడీ రోబో గా నటించింది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం 2.0 సినిమాకి వెన్నుముక్క అని చెప్పవచ్చు.




500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మించారు. కేవలం అమెరికా లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా 2.0 చిత్రాన్ని భారీ ఎత్తున్న విడుదల చేస్తున్నారు. తెలుగు లో సుమారు 75 కోట్లకి 2.0 చిత్రాన్ని కొన్నట్టు సమాచారం. ఇంత భారీ మొత్తాన్ని తెలుగు లో రాబట్టాలి అంటే చాలా కష్టం అని తెలుగు ట్రేడ్ పండితులు అంటున్నారు, కానీ సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ కి ఉన్న క్రేజ్ కి హిట్ టాక్ వస్తే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం కష్టం కాదని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. రిలీజ్ తరువాత ఏ రేంజ్ లో రికార్డ్స్ ని తిరగ రాస్తుందో వేచి చూడాలి. 2.0 చిత్రాన్ని త్వరలోనే చైనా లో కూడా విడుదల చేయనున్నారు.

No comments