విడుదలైన 2.0 ట్రైలర్, హాలీవుడ్ లెవెల్ లో ఉన్నాయ్ గ్రాఫిక్స్.!
ఇండియన్ చలన చిత్ర సీమలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా 2.0, సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు, 2.0 సినిమా నవంబర్ 29 న రిలీజ్ అవ్వబోతుంది, ఇవ్వాళా ఆ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది, ట్రైలర్ అద్భుతంగా ఉంది, ఈ చిత్రం తో చిట్టి ఎన్ని రికార్డ్స్ బాధలు కొడతాడో వేచి చూడాలి.
ఈ చిత్ర ట్రైలర్ అంతా 3డి వర్షన్ లోనే ఉంటుంది. దీన్ని చూడ్డానికి కేవలం 3డి స్క్రీన్స్ మాత్రమే ఉండాల్సిన పనిలేదు. మన స్మార్ట్ ఫోన్స్ లో కూడా ఈ 3డి వర్షన్ చూసే అవకాశం కల్పించారు దర్శక నిర్మాతలు. దానికోసం ఫోన్స్ లో వావ్ 3డి స్క్రీన్ గార్డ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకుని 3డి వర్షన్ ఎంజాయ్ చేయొచ్చు. అభిమానుల కోసం దర్శక నిర్మాతలు ప్రత్యేకంగా ప్లాన్ చేసిన యాప్ ఇది. ఇందులో చూస్తే 3డి వర్షన్ ఎంజాయ్ చేస్తారు.
సాధారణంగా 543 కోట్లు అంటే గుండె ఆగిపోతుంది.. నమ్మడానికి కాస్త టైమ్ పట్టినా ఇప్పుడు శంకరే ఈ బడ్జెట్ కన్ఫర్మ్ చేసాడు. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత హాలీవుడ్ సినిమానే స్వయంగా మన ముందుకు తీసుకొచ్చినట్లు అర్థమైపోతుంది. ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ సినిమాలకు కూడా సాధ్యం కాని విజువల్ ఎఫెక్ట్స్ 2.0 కోసం వాడుకున్నాడు శంకర్. ముందు ఈ సినిమాను 250 కోట్లతో మొదలుపెట్టినా కూడా ఇప్పుడు అది 543 కోట్ల దగ్గర ఆగింది. అయితే ఎంత పెట్టినా కూడా వెనక్కి వస్తుందనే నమ్మకం కూడా దర్శక నిర్మాతల్లో కనిపిస్తుంది.
ఎంత డైజెస్ట్ చేసుకుందాం అనుకున్నా కూడా ఒక్క సినిమా కోసం ఇన్నేసి వందల కోట్లు పెట్టించడం మాత్రం కాస్త అతిగానే అనిపిస్తుంది. ఇంత వసూలు చేయాలంటే సినిమా ఎంత వసూలు చేయాలి..? ఎంత అద్భుతంగా ఆడాలి..? మరి అంత విషయం "2.0"లో ఉంటుందా..? ఒకవేళ ఏదైనా అదృష్టం బాగోలేక అది మిస్ అయిందే అనుకోండి.. నిర్మాతల పరిస్థితి ఏంటి..? అక్కడ ఒకటి రెండు కాదు.. ఏకంగా 543 కోట్లు. హాలీవుడ్ సినిమాలకు కూడా పెట్టనంత బడ్జెట్ అది.
ఒకప్పుడు "ఎక్స్ మెన్" కోసం 543 కోట్లు పెట్టారు. ఇప్పుడు అంత బడ్జెట్ ఈ ఒక్క సినిమాకే పెట్టించాడు శంకర్. హాలీవుడ్ లో వచ్చిన విజువల్ వండర్స్ "బ్యాట్‌మెన్".. "డెడ్‌పూల్" కంటే కూడా "2.0" బడ్జెట్ ఎక్కువ. ఈ ఒక్క సినిమా కోసమే ప్రపంచ వ్యాప్తంగా 3000 మంచి టెక్నీషియన్స్ మూడేళ్లుగా కష్టపడుతూనే ఉన్నారు. సినిమా అంతా 3డిలోనే తెరకెక్కించాడు శంకర్. హాలీవుడ్ సినిమాలను సైతం ముందు 2డిలో తీసి.. ఆ తర్వాత 3డిలోకి మారుస్తుంటారు. కానీ శంకర్ మాత్రం ఈ సినిమాను మొత్తం 3డిలోనే తెరకెక్కించడం విశేషం.
ఇక ఇప్పుడు ఈ చిత్ర బిజినెస్ కూడా సంచలనం సృష్టిస్తుంది. కేవలం తమిళనాట మాత్రమే 110 కోట్లకు ఈ చిత్రం అమ్ముడైందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక తెలుగులో ఎన్వీ ప్రసాద్ దాదాపు 80 కోట్లకు ఈ చిత్ర హక్కులు తీసుకున్నాడనే ప్రచారం జరుగుతుంది. కన్నడ, ఓవర్సీస్ ఇలా ప్రతీ భాషలోనూ రికార్డ్ ధరకే "2.0" రైట్స్ అమ్ముడవుతున్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత కచ్చితంగా అంచనాలు మరింత పెరుగుతాయనేది నిస్సందేహంగా చెప్పొచ్చు. మరి చూడాలిక.. "2.0" ట్రైలర్ ఎలా ఉండబోతుందో.. వచ్చిన తర్వాత రచ్చ ఎలా ఉండబోతుందో..?
Watch Video:
https://youtu.be/QDKY8CRe1-0
Post a Comment