Header Ads

విడుదలకి ముందే సంచలనం సృస్తిస్తున 2.0 చిత్రం. బాహుబలి-2 రికార్డుని అధిగమించిన 2.0.!!

సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య పాత్ర పోషిస్తున్న 2.0 చిత్రానికి దిగ్గజ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్ 2.0 చిత్రం లో విలన్ గా నటించాడు. అమీ జాక్సన్ ఇందులో లేడీ రోబో గా నటించింది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం 2.0 సినిమాకి సంగీతం అందించాడు.


2.0 చిత్రం విడుదలకి ముందే ఎన్నో రికార్డు లను బద్దలు కొట్టింది. బుక్ మై షో వెబ్సైట్ లో మొదటి సారి 3 లక్షల ఇంట్రెస్ట్ లైక్స్ ని క్రాస్ చేసిన సినిమా గా రికార్డు సృష్టించింది. హైదరాబాద్ లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, ఓపెన్ అయిన వెంటనే హాట్ కేక్ లాగా అమ్ముడు పోతున్నాయి. తెలుగు, తమిళ్ తో పాటు హిందీ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు 2.0 చిత్రాన్ని. అన్ని బాషలలో కలిపి సుమారు 6800 థియేటర్ లలో 2.0 చిత్రాన్ని విడుదల చేస్తున్నారు, ఈ లెక్క రిలీజ్ కి ముందు టికెట్ ల డిమాండ్ ని బట్టి ఇంకా పెరగవచ్చు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్ లలో రిలీజ్ అయిన భారతీయ సినిమా లలో బాహుబలి-2 ప్రధమ స్థానం లో ఉండేది, 6500 థియేటర్ లలో రిలీజ్ అయిన బాహుబలి-2 ని, 2.0 చిత్రం 6800 పైగా థియేటర్ లలో విడుదల అవుతూ బాహుబలి-2 రికార్డు ని బ్రేక్ చేసింది.

500 కోట్ల భారీ బడ్జెట్ తో 2.0 సినిమా ను నిర్మించారు. తెలుగు లో సుమారు 75 కోట్లకి 2.0 చిత్రాన్ని కొన్నట్టు సమాచారం. ఇంత భారీ మొత్తాన్ని తెలుగు లో రాబట్టాలి అంటే చాలా కష్టం అని తెలుగు ట్రేడ్ పండితులు అంటున్నారు, కానీ సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ కి ఉన్న క్రేజ్ కి హిట్ టాక్ వస్తే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం కష్టం కాదని ట్రేడ్ విశ్లేషకుల అంచనా.

నవంబర్ 29 న రిలీజ్ అవ్వబోతున్న 2.0 చిత్రం, రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ బాధలు కొడుతుందో వేచి చూడాలి. 2.0 చిత్రాన్ని త్వరలోనే చైనా లో కూడా విడుదల చేయనున్నారు.

No comments