Header Ads

సోషల్ మీడియా లో మొదలైన బాహుబలి - 2 V/S 2.0 వాదనలు.!!

2.0 చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ రావడం తో బాహుబలి రికార్డ్స్ తుడిచిపెట్టుకొని పోతాయి అని అందరు భావిస్తున్నారు, అలా అనుకోడం లో తప్పు లేదు, కానీ బాహుబలి చిత్రాన్ని కించ పరుస్తూ ట్రోల్ల్స్ వేస్తే ఊరుకోము అంటున్నారు కొందరు తెలుగు అభిమానులు, ట్విట్టర్ వేదికగా ఇప్పుడు హాట్ హాట్ గా ఒకరి పైన ఒకరు ట్వీట్స్ వేసుకుంటున్నారు.




కచ్చితంగా బాహుబలి-2, దంగల్ ప్రపంచ వ్యాప్తంగా నెలకొలిపిన రికార్డ్స్ ని 2.0 దాటి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో 2500CR పైగా కలెక్షన్స్ సాధిస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. రాజమౌళి కంటే శంకర్ తక్కువ అంటూ కామెంట్స్ చేసిన వాళ్లందరికీ, శంకర్ తన స్థాయి ఏంటో 2.0 తో చూపించాడు అని కొంత మంది ట్వీట్స్ వేస్తున్నారు, కానీ చాలా వరకు తెలుగు ప్రజలు మాత్రం 2.0 సినిమాకు అండగా ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సినిమాలకు ఏ రేంజ్ లో అయితే మొదటి రోజు కలెక్షన్స్ వస్తాయో, అదే రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే 2.0 చిత్రానికి వచ్చే అవకాశాలున్నాయి. అంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రజలను తక్కువగా చేసి మాట్లాడటం తగదని ట్రోల్ చేస్తున్న వారి పైన మండిపడుతున్నారు, రానున్న రోజుల్లో 2.0 V/S బాహుబలి అంటూ ఆర్టికల్స్ మొదలు, సోషల్ మీడియా లో పోస్ట్స్/ట్వీట్స్, యూట్యూబ్ లో వీడియోస్, మీడియా లో స్పెషల్ స్టోరీస్.. ఇలా చాలా చూడొచ్చు, పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి కానీ అసభ్యంగా ఉండకూడదు అనేది అందరి వాదన. బాహుబలి-2, 2.0 చిత్రాల్లో, దేన్నీ కించ పరచ కూడదు.

2.0, బాహుబలి-2 చిత్రాలు రెండు భారతీయ సినిమా కీర్తి ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన సినిమాలు, శంకర్-రాజమౌళి లకు మనం మనసారా ధన్యవాదాలు చెప్పడం కంటే ఏం చేయలేము, రెండు సినిమాల్లో ఏది గొప్ప అనే వాదనలు పక్కన పెట్టి, దేశ వ్యాప్తంగా , ప్రపంచ వ్యాప్తంగా దక్షిణాది చిత్రాలకు వన్నె తెచ్చిన ఈ రెండు చిత్రాలను అభినందించండి .

Tweet:

https://twitter.com/Baahubali2017/status/1067830025750118400

No comments