Header Ads

కన్నె స్వామి, గురు స్వాములకు తేడా తెలుసా..? మొత్తం 18 పేర్లు ఉన్నాయి..అవేంటంటే..?

కార్తిక మాసం మొదలు మార్గశిర పుష్య మాసం వరకూ కొందరు నల్లటి బట్టలేసుకుని ,కఠిన నియమాలను అనుసరిస్తూ స్వామి దీక్షలో ఉంటారు..శబరిలోని కొండల మధ్య కొలువున్న అయ్యప్పను దర్శించుకోవాలంటే భక్తులు తప్పనిసరిగా మాలాధారణ చేసుకోవాలి… అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు 41వ రోజుల పాటు నియమ నిష్టలు పాటించాలి. తర్వాత ఇరుముడి కట్టుకుని అయ్యప్ప స్వామి సన్నిధానం చేరి స్వామిదర్శనం చేసుకోవడంతో దీక్ష ముగుస్తుంది. స్వామి మాల వేసుకున్న వారిని ఒక్కొక్కరిని ఒక్కో పేరుతో సంభోదిస్తుంటారు..ఎక్కువగా కన్నెస్వామి,గురు స్వామి అనే పదాలు మనం వినే ఉంటాం.
అయ్యప్ప దీక్షను తొలిసారిగా తీసుకున్న వారిని కన్నెస్వాములు అని అంటారు. కన్నెస్వాములంటే స్వామికి ఎంతో ప్రీతి. అందుకే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తమ సన్నిధానంలో ఒక్క కన్నెస్వామి ఉండాలని కోరుకుంటారు.మొదటిసారి దీక్ష చేపట్టేవాళ్లు కన్నెస్వాములు అయితే.. రెండోసారి కత్తిస్వామి, మూడోసారి గంటస్వామి, నాలుగోసారి గధాస్వామి, ఐదోసారి గురు స్వామి, ఆరోసారి జ్యోతి స్వాములుగా పిలుస్తారు…ఈ విధంగా మొత్తం పద్దెనిమిదాసార్లు మాల వేసుకునే వారికి ఒక్కోసారి ఒక్కో పేరుతో పిలుస్తుంటారు..అంతే కాదు పద్దెనిమిదో సారి మాల వేసుకునే వారిని నారికేళ స్వామి అంటారు..పద్దెనిమిదవ సంవత్సరం కొబ్బిరచెట్టుని తీసుకెళ్లడం ఆనవాయితి.


అయ్యప్ప స్వామి దీక్షకు పాటించాల్సిన కఠోర నియామాలు ఏమిటో తెలుసా..?

ధనుర్మాసం అనగానే సూర్యోదయంలోగా స్నానాలు.. పూజలు.. ఉపవాసాలు.. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక కార్యక్రమాలే కనిపిస్తాయి. మాలధారణలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత ఉట్టిపడతాయి. ఈ మాసంలోనే వేలాది మంది భక్తులు జ్యోతిస్వరూపుడు.. హరిహరసుతుడు.. శబరిమల మీద కొలువై ఉన్న దేవదేవుడు, ప్రతి సంవత్సరం వందల మంది స్వామి దీక్ష చేబట్టి జ్యోతి దర్శనం కోసం శబరికి వెళతారు.

శక్తిరూపుడైన అయ్యప్ప దీక్షను ఆచరిస్తారు. శివునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో కఠిన నియమ, నిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు.

శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకొని సన్మార్గంలో పయనింపజేసేదే అయ్యప్ప మండల దీక్ష. 41 రోజుల పాటు అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటూ నిత్యశరణు ఘోషతో పూజిస్తారు. మనసారా అయ్యప్పస్వామిని కొలవడమే ఈ దీక్ష పరమార్థం. రోజులో ఒకసారి భిక్ష.. మరోసారి అల్పాహారం.. రెండుసార్లు చన్నీటి సాన్నం.. నేలపై నిద్రించాలనే కఠిన నియమాలతోరణమే ఈ దీక్ష. ప్రాధాన్యత.. పాటించాల్సిన నియమాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.


దీక్ష చేపట్టే విధానం

అయ్యప్పస్వామి మాల ధరించాలనుకునేవారు మూడు రోజుల ముందు నుంచే పవిత్రంగా ఉండాలి. మద్యం, మాంసం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలి. మాలధారణకు తల్లిదండ్రులు, భార్య అనుమతి ఉండాలి. తల వెంట్రుకలు, గోళ్లు, ముందుగానే కత్తిరించుకోవాలి. మాల ధరించే రోజు పాదరక్షలు లేకుండా శుభ్రమైన దుస్తులను ధరించి నల్లని లుంగీ, కండువా, చొక్కా, తులసిమాల తీసుకొని అయ్యప్ప ఆలయానికి వెళ్లాలి.

దీక్ష స్వీకరించాక..

మాలధారులు మండల దీక్షను పూర్తి చేసుకోవడానికి విడిది ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో స్థలం ఉంటే పీఠం పెట్టుకోవచ్చు. అలా వీలుకాకుంటే సామూహికంగా సన్నిధానం ఏర్పాటు చేసుకోవచ్చు. సన్నిధానంలో ఎత్తయిన పీఠం ఏర్పాటు చేసి నూతన వస్త్రంపై బియ్యం పోసి గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప స్వాముల చిత్రపటాలను ప్రతిష్ఠించాలి. అయప్ప మాల ధరించే వారు పాటించాల్సిన నియమాలు మాల ధరించిన స్వాములంతా నిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానమాచరించి సూర్యోదయం కాకముందే పూజనుముగించాలి. తిరిగి సాయంత్రం చన్నీటి స్నానం చేసి సంధ్యాపూజ చేయాలి.అయప్ప మాల ధరించే వారు పాటించాల్సిన నియమాలు భిక్షాటన చేసిన బియ్యంతోనే స్వయంగా వండుకోవాలి. అలా సాధ్యం కాని పరిస్థితుల్లో 41 రోజుల మండల దీక్ష పూర్తయ్యాక ఇరుముడి కట్టుకోవడానికి ముందు ఐదు ఇళ్లలో భిక్షాటన చేయవచ్చు.

పదునెట్టాంబడి ప్రశస్త్తి.

పదునెట్టాంబడి అంటే 18 మెట్లు అని అర్థం. ఈ మెట్లలో ఎంతో మహత్యం ఉంది. కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం, మోహం, దర్పం, అహంకారం, వీక్షణాశక్తి, వినికిడి శక్తి, అగ్రాణశక్తి, రుచి చూసే శక్తి, స్పర్శశక్తి, సత్వగుణాలు, తమోగుణం, రజోగుణం, విద్య, అవిద్య. ఇలా అష్టాదశ శక్తులు అయ్యప్ప ఆలయం ముందు మెట్లపై నిక్షిప్తమై ఉన్నాయని ఆర్యులు పవిత్ర గ్రంథాల్లో పొందుపరిచారు. ఆ మెట్లలో 18 రకాల శక్తులుండటం వల్ల 18 సార్లు యాత్ర చేసి వస్తే తమ జన్మ సార్థకమని భక్తుల ప్రగాఢ విశ్వాసం
మాల విరమణ శబరిమలలో అయ్యప్పస్వామి దర్శనానంతరం దీక్షాపరులు ఇంటికి తిరిగి వచ్చాకే మాల విరమణ చేయాలి. ఇంటివద్ద మాతృమూర్తితో మాల తీయిం చాలి. దానిని మరుసటి ఏడాది కోసం భద్రపర్చాలి. కొందరు తిరుపతి వేంకటేశ్వరస్వామి సన్ని ధిలో మొక్కు తీర్చుకునేందుకు అక్కడే మాలతీస్తున్నారు.

No comments