Header Ads

17 -11 -2018 (శనివారం) రోజు వారి రాసి ఫలాలు.. ఏ రాసి వారికీ బాగుందో తెలుసుకోండి.?

మేషం :

కొట్లాటలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది, లేని పోనీ సమస్యలు మీ మెడకు చుట్టుకుంటాయి. ఆంజనేయ స్వామి ని పూజించడం వలన మంచి జరుగుతుంది. వ్యాపారాల్లో నష్టాలు తప్పవు. ప్రేమ, పెళ్లి విషయాల్లో కష్టాలు వస్తాయి. ఉద్యోగ, విద్య విషయాలు సానుకూలంగా ఉంటాయి.




వృషభం :

పరమేశ్వరుడిని పూజించడం ద్వారా మంచి జరుగును. వ్యాపార ఉద్యోగ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడాలి, దూర ప్రయాణాల్లో కష్టాలను ఎదురుకుంటారు, అనుకోని వ్యక్తులతో పరిచయం అవుతుంది. భార్య భర్తలు సంతోషముగా ఉంటారు.

మిథునం:

నీలి రంగు దుస్తులను ధరించడం ద్వారా మంచి జరుగును, కోపానికి లోనయ్యే సంఘటనలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు తప్పవు. కోర్ట్ సంబంధిత కేసు ల నుండి విముక్తి పొందుతారు. రాముడిని పూజించటం ద్వారా మంచి జరుగుతుంది.

కర్కాటకం :

మిత్రులతో తగాదాలు తప్పవు, బంధువులతో అనుకోని ప్రయాణాలు ఉంటాయి, ప్రయాణాల్లో జాగ్రత్త వహించవలెను. కన్న బిడ్డల రహస్యాలు కొన్ని బయట పడతాయి. భార్య భర్తల మధ్య కొట్లాటలు సంభవిస్తాయి. లక్ష్మి దేవి ని పూజించడం వల్ల మంచి జరుగుతుంది.

సింహం :

కృష్ణుడిని ఆరాధించడం వలన మంచి జరుగును, వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి, కొత్తగా ఏ వ్యాపారాలు పెట్టకండి. పిల్ల వాళ్ళను సురక్షితంగా చూసుకోవాలి, ఆడవాళ్లకు ఎటు వంటి తిప్పలు బాధలు ఉండవు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి.

కన్య :

పచ్చ రంగు వస్త్రాలను ధరించండి. అనాధ పిల్లలకు, ముసలి వాళ్లకు అన్నదానం లేదా వస్త్ర దానం లో ఏదో ఒకటి కచ్చితంగా చేస్తే వ్యాపారాల్లో నష్టం రాకుండా ఉంటుంది, దానం చేయడం వల్ల అనుకున్నది సాధిస్తారు. అమ్మాయిల విషయం లో బాధకు లోనవుతారు. స్త్రీ లకు ఇవ్వాళ ఆరోగ్య సమస్యలు వస్తాయి.

తుల :

అనుకున్న కార్యాలు జాగ్రత్తగా చేస్తే తప్పక నెరవేరుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించవలెను, ఆడవాళ్లకు ఇవ్వాళ బాగా కలిసి వస్తుంది. పార్వతి దేవి ని ఆరాధించడం ద్వారా మంచి జరుగుతుంది. అనాధ పిల్లలకు అన్నదానం చేయడం ద్వారా మంచి జరుగుతుంది.

వృశ్చికం :

అనుకోని కష్టాలు ఎదురవుతాయి, ఆరోగ్య రీత్యా సమస్యలు వస్తాయి, ఇంట్లోని ఆడవాళ్లకు ఆరోగ్య సమస్యలు తప్పవు, ఆంజనేయ స్వామి ని ఆరాధించడం ద్వారా మంచి జరుగుతుంది. వ్యాపారాల్లో లాభం వస్తుంది.

ధనుస్సు :

ఎరుపు రంగు బట్టలను ధరించడం ద్వారా మంచి జరుగుతుంది, వ్యాపారాల్లో స్వల్ప నష్టాలూ వస్తాయి, శివుడిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది. మూగ జీవాలకు తిండి పెట్టడం ద్వారా మీకు మేలు జరుగుతుంది.

మకరం :

మిత్రులకు దూరంగా ఉండటం మంచిది. అనాధ పిల్లలకు, ముసలి వాళ్లకు అన్నదానం, వస్త్ర దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది.అబ్బాయిలు, అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి.

కుంభం :

వినాయకుడిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయి, కొడుకు కూతుళ్ళ విషయం లో జాగ్రత్త వహించాలి, ఇంట్లోని ఆడవాళ్ళతో కొట్లాటలు వస్తాయి, అత్త కోడళ్ల మధ్య మనస్పర్థలు ఏర్పడుతాయి.

మీనం :

తెల్ల రంగు దుస్తుల్ని ధరించండి, ఖర్చు అధికమవుతుంది, అనుకోని ప్రయాణాలు ఉంటాయి, ఇంట్లోని స్త్రీల ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆడవాళ్ళూ లక్మి దేవి కి పూజ చేయడం ద్వారా మంచి జరుగుతుంది. ప్రేమ విషయం లో దెబ్బతింటారు.

No comments