Header Ads

106 సంవత్సరాల బామ్మ కల నెరవేర్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు.!!

సూపర్ స్టార్ మహేష్ బాబు, తెలుగు సినీ చిత్ర రంగం లో టాప్ హీరో. మహేష్ బాబు కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది, ఫామిలీ ఆడియన్స్ అయితే బాబు సినిమా రిలీజ్ అయితే ఎగబడి చూస్తారు, పోకిరి చిత్రం తరువాత మాస్ ఆడియన్స్ లో మహేష్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇలా మాస్, క్లాస్, యూత్ అందరిలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టే టాప్ హీరో అవ్వగలిగాడు మహేష్ బాబు. మహేష్ బాబు అభిమానుల సంఖ్యా లో చిన్న పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు ఉన్నారు.




అక్కినేని నాగేశ్వర్ రావు గారికి ఈ తరం హీరో లలో మహేష్ బాబు అంటేనే ఎక్కువ ఇష్టం, సినీ యాక్టర్స్ లో కూడా మహేష్ అంటే ఇష్ట పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహేష్ బాబు సినిమా రిలీజ్ అయ్యింది అంటే చాలు, మా ఫామిలీ అంత కలిసి మహేష్ సినిమా కి వెళ్ళిపోతాం అని చిరంజీవి గారు చెప్పారు, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, ఫిలిం ఇండస్ట్రీ లో ఉండే చాలా మంది మహేష్ అంటే తమకి ఎంత ఇష్టమో చాలా సందర్భాల్లో చెప్పారు.

రాజమండ్రికి చెందిన 106 సంవత్సరాల వయసు గల 'రేలంగి సత్యవతి', మహేష్ కు వీరాభిమాని. ఎప్పటినుండో మహేష్ ను కలవాలని తపన పడింది, పడుకునేటప్పుడు మహేష్ బాబు ఫోటో ను తన దెగ్గర పెట్టుకొని పడుకుంటుంది. లేచిన దెగ్గర నుండి, పాడుకొనే వరకు మహేష్ బాబు ని కలవాలి, ఆ బాబు ని కలిసి నేను హాయిగా చనిపోతా అంటూ ఉంటాది, ఈ బామ్మా పైన ఒక న్యూస్ ఛానల్ ప్రచురించిన కధనం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది, విషయం తెలుసుకున్న మహేష్ బాబు, బామ్మా ను కలవాలని నిర్ణయించుకున్నాడు. మహర్షి చిత్ర షూటింగ్ సెట్ కు ఆమెను పిలిపించి ఆమె తో సరదాగా మాట్లాడారు మహేష్. ఆ తరువాత ఆమె తో కలిసి ఫొటోలు కూడా దిగారు. ఈ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసి సత్యవతి గారిని కలిసినందుకు ఆమె కంటే ఎక్కువ నాకే సంతోషం గా ఉందని మహేష్ బాబు అన్నారు.

మహేష్ బాబు సత్యవతి గారిని కలిసిన వీడియో, ఫొటోస్, ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. మహేష్ బాబు ని కలిసాక ఆమె కళ్ళలో ఆనందం మాటల్లో వర్ణించలేము.

Instagram:

https://www.instagram.com/p/BqoVRZnl3N5/

Watch Video :

https://youtu.be/LTDHSR3mKyY

No comments