Header Ads

రవితేజ V/S విజయ్ దేవరకొండ..!‘టాక్సీ’ స్పీడుకు ‘అమర్‌’ బ్రేక్‌ వేస్తాడా?

'నోటా' మూవీ రిలీజ్ అయిన రోజే రవితేజ నటించిన 'అమర్ అక్బర్ ఆంథోనీ' చిత్రం రిలీజ్ అవ్వాల్సి ఉంది, కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఆ మూవీ ని పోస్ట్ పోన్ చేసారు, ఆ సమయం లో విజయ్ దేవరకొండ రవితేజ మధ్య క్లాష్ మిస్ అయ్యింది అని అందరు భావించారు, కానీ ఈ సారి మాత్రం రవితేజ, విజయ్ దేవరకొండ తో తలపడక తప్పట్లేదు.




విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' చిత్రం నవంబర్ 16 న రిలీజ్ అవ్వబోతుంది, అదే రోజు రవి తేజ నటించిన 'అమర్ అక్బర్ ఆంథోనీ' చిత్రం కూడా విధుల అవుతుందని 'అమర్ అక్బర్ ఆంథోనీ' మూవీ నిర్మాతలు అయిన మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు, శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో ఇలియానా, రవితేజ సరసన జంటగా నటించింది. ఇటీవల రిలీజ్ చేసిన 'అమర్ అక్బర్ ఆంథోనీ' టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడం తో, ఈ చిత్రం తో శ్రీను వైట్ల మరియు రవితేజ హిట్ ట్రాక్ లోకి వస్తారని అభిమానులు మరియు చిత్ర బృందం ధీమాగా ఉన్నారు, 'రాజా ది గ్రేట్' చిత్రం ఘన విజయం తర్వాత వచ్చిన 'టచ్ చేసి చూడు', 'నేల' టికెట్ చిత్రాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి, దింతో రవితేజ అభిమానుల ఆశలన్నీ 'అమర్ అక్బర్ ఆంథోనీ' చిత్రం మీదనే ఉన్నాయ్.

విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' తెలుగు చిత్ర సీమ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిపోయింది, ఆ మూవీ తర్వాత వచ్చిన 'నోటా' చిత్రం నిరాశ పరిచింది, దీంతో విజయ్ దేవరకొండ కి 'టాక్సీవాలా' చిత్రం హిట్ అవ్వడం ఎంతో అవసరం, సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన చిత్రాన్ని వాయిదాలు వేస్తూ దీపావళి కి తీసువచ్చారు, కానీ దీపావళి టైం కి నాగ చైతన్య 'సవ్యసాచి' తో వస్తుండటం తో,ఆ మూవీ తో క్లాష్ పడటం ఇష్టం లేక నవంబర్ 16 కి షిఫ్ట్ అయ్యారు, కానీ అదే రోజు 'అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రం' విడుదల తేదీని ప్రకటించడం తో, రెండిట్లో ఏది వెనక్కి తగ్గుతుందో చూడాలి, నవంబర్ నెలాఖరున 2.0 చిత్రం విడుదల అవుతుంది కనుక 'అమర్ అక్బర్ ఆంథోనీ', 'టాక్సీవ్వాలా' నవంబర్ 16 నే రిలీజ్ అవుతాయి అని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నిజంగానే రెండు చిత్రాలు నవంబర్ 16 నే రిలీజ్ అవుతే, బాక్స్ ఆఫీస్ దెగ్గర గట్టి పోటీ తప్పదు

No comments