Header Ads

విజయ్ దేవరకొండ V/S నాగ చైతన్య?

నవంబర్ 2nd వ తారీకు నాగచైతన్య నటించిన 'సవ్యసాచి' మూవీ రిలీజ్ అవుతుంది,అదే నెలలో విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' చిత్రం కూడా రిలీజ్ అవుతుంది,నవంబర్ 16న 'టాక్సీవాలా' చిత్రం రిలీజ్ అవుతుంది.




ఇది వరకు విజయ్ నటించిన 'గీత గోవిందం' రిలీజ్ అయిన నెల వ్యవధిలో 'శైలజ రెడ్డి అల్లుడు' చిత్రం విడుదల అయ్యింది, ఈ రెండు చిత్రాల్లో 'గీత గోవిందం' ఘన విజయం అందుకోగా,'శైలజ రెడ్డి అల్లుడు' బాక్స్ ఆఫీస్ దెగ్గర యావరేజ్ మూవీగా నిలిచిపోయింది, కనుక ఇప్పుడు వస్తున్న 'సవ్యసాచి' పైనే అక్కినేని అభిమానుల ఆశలు పెట్టుకున్నారు. 'సవ్యసాచి' రిలీజ్ అయిన రెండు వారాల వ్యవధిలో 'టాక్సీవాలా' మూవీ రిలీజ్ అవుతుంది, 'నోటా' మూవీ తో దసరా సీజన్ ని కాష్ చేసుకోలేక పోయాడు విజయ్,ఎన్నో అంచనాల నడుమ తెలుగు తమిళ్ బాషలలో రిలీజ్ అయిన 'నోటా' మూవీ ప్లాప్ అవడం తో విజయ్ ఆశలన్నీ 'టాక్సీవాలా' పైనే పెట్టుకున్నాడు. రిలీజ్ డేట్ ల విషయం లో సమ్మర్ నుండి ఎన్నో వాయిదాలు పడుతూ వస్తున్న 'టాక్సీవాలా' రిలీజ్ డేట్ ని నవంబర్ 16 కి ఫిక్స్ చేసారు.నవంబర్ నెలని 'సవ్యసాచి' మరియు 'టాక్సీవాలా' మూవీస్ ఏ రకంగా కాష్ చేసుకుంటారో చూడాలి. ఈ రెండు మూవీస్ మధ్యలో తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' మూవీ రిలీజ్ అవుతుంది,మురుగదాస్ దర్శకత్వం వహించిన సర్కార్ మూవీ నవంబర్ 6 న రిలీజ్ అవుతుంది, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది,తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ అవ్వబోతున్న 'సర్కార్' చిత్రం నాగ చైతన్య 'సవ్యసాచి' మరియు విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' సినిమాస్ కి పోటీగా నిలుస్తానంద లేదా అనేది వేచి చూడాలి.

No comments