Header Ads

ఫ్లాస్టిక్ కు పూర్తిగా నో చెప్పింది,UNO అవార్డ్ గెలిచి, దేశ గౌర‌వాన్ని నిల‌బెట్టిన రాష్ట్రం.!

సిక్కిం.. మన దేశంలో ఉన్న ఎన్నో రాష్ర్టాల్లో ఇది కూడా ఒకటి. పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. పర్వతాలు, సెలయేళ్లు, పచ్చిక బయళ్లు చూపరులను కట్టి పడేస్తాయి. అయితే ఇప్పుడదే రాష్ట్రం అంతర్జాతీయంగా ఓ అంశంలో ఖ్యాతిని గడించింది. అదేమిటంటే.. ప్రపంచంలోనే మొదటి ఆర్గానిక్ స్టేట్‌గా సిక్కిం రికార్డుకెక్కింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం పవన్ కుమార్ కామ్లింగ్ ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఏవో) ఫ్యూచర్ పాలసీ గోల్డ్ అవార్డును ఇటీవలే అందుకున్నారు. సిక్కిం రాష్ట్రం 100 శాతం ఆర్గానిక్ స్టేట్‌గా మారినందుకు ఆ రాష్ర్టానికి ఈ ఘనత దక్కింది.




కేవలం ఇదే కాకుండా సిక్కింకు మరో అవార్డు కూడా దక్కింది. 51 దేశాల నుంచి వచ్చిన నామినేషన్లలో సిక్కింకు ఆస్కార్ ఫర్ బెస్ట్ పాలసీస్ అవార్డు దక్కింది. సిక్కిం తరువాతి స్థానంలో బ్రెజిల్, డెన్మార్క్, క్విటోలు సిల్వర్ అవార్డును సాధించాయి. సిక్కింలో ఆర్గానిక్ వ్యవసాయం దిశగా రైతులు ఎంతో అభివృద్ధిని సాధించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి 66వేల మంది రైతులకు ఆర్గానిక్ వ్యవసాయం కోసం సహాయం చేసింది. దీంతోపాటు పలు ఇతర మార్గాలను కూడా పక్కగా అనుసరించడం వల్లే సిక్కిం ఈ రెండు ఘనతలను సాధించింది.

అయితే సిక్కిం ఈ రెండు ఘనతలను సాధించేందుకు నిజానికి చాలా కాలమే పట్టిందని చెప్పవచ్చు. 2003లో ఒక మిషన్‌లా ప్రారంభమైన ఆర్గానిక్ వ్యవసాయం కొత్త పుంతలు తొక్కింది. అక్కడి ప్రభుత్వాలు రైతులకు మద్దతుగా నిలిచాయి. అంతేకాదు, యువ, ఔత్సాహిక రైతులను ఆర్గానిక్ ఫామింగ్ దిశగా ప్రోత్సహించాయి. సరైన సమయంలో రైతులకు కావల్సిన సహాయాన్ని అందించాయి. అంతేకాకుండా పండిన పంటకు సరైన ధర వచ్చేలా పక్కాగా మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేశారు. కనుకనే ఆ రాష్ట్రం 100 శాతం ఆర్గానిక్ రాష్ట్రంగా మారింది. అన్ని రాష్ర్టాలు సిక్కింను ఆదర్శంగా తీసుకుంటే దేశంలో అప్పుడిక కెమికల్స్ వాడకం ఉండదు. దీంతో పర్యావరణానికే కాదు, మన ఆరోగ్యాలకు కూడా మేలు కలుగుతుంది

No comments