TRS మేనిఫెస్టో..... నెలకు 3016 నిరుద్యోగ భృతి.!
గులాబీ బాస్ KCR తమ పార్టీ మేనిఫెస్టో ను విడుదల చేశారు. ప్రస్తుతానికి పాక్షిక మేనిఫెస్టో విడుదల చేసిన KCR, త్వరలోనే పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తామని ప్రకటించారు. పాత సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెబుతూనే మేనిఫెస్టోలో కొత్త పథకాలను ప్రకటించారు పార్టీ చీఫ్ కెసిఆర్.
మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు:
- పింఛను...2016 రూపాయలకు పెంపు., 57 ఏళ్లు నిండిన వారికి కూడా ఆసరా పింఛన్లు.
- నిరుద్యోగులందరికీ రూ.3016 నిరుద్యోగ భృతి.
- రైతు బంధు పథకం కింద రైతులకు ఎకరానికి ఇచ్చే రూ.8 వేలను 10 వేలకు పెంపు.
- సొంత భూమి ఎక్కడుంటే అక్కడే డబుల్ బెడ్ రూమ్.
- ఒకటి, రెండు వాయిదాల్లోనే రైతులకు లక్ష రుణమాఫీ.
- మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులు త్వరలోనే పూర్తి.
- 2021 జూన్ లోపు కోటి ఎకరాలకు సాగు నీరు .
Post a Comment