మీ అరచేతిలో ఈ గుర్తు ఉందా..? ఉంటే మీరు హీరో కిందే లెక్క..!
మీ రెండు అరచేతులను ఓ సారి చూసుకోండి. ఏం కనిపిస్తున్నాయి..? మధ్యలో రేఖలు ఉంటాయి కదా. అవును, అవే. అయితే వాటిని ఓ సారి జాగ్రత్తగా పరిశీలించండి. పరిశీలించారా..? రేఖల మధ్యలో x ఆకారంలో ఏదైనా గుర్తు ఉందా..? అంటే… ఆ గుర్తు కూడా రేఖల ఆకారంలోనే ఉంటుంది లెండి..! ఆ గుర్తు మీ అరచేతుల్లో ఉందా..? ఇంకేం… మీరు అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తులుగా ఉంటారట. మీరే కాదు, మీరు ఇతరులను కూడా విజయ పథంలో నడిపించగలరట. అవును, మీరు వింటోంది కరెక్టే. ఇది మేం చెబుతోంది కాదు. జ్యోతిష్య శాస్త్రం అంతకన్నా కాదు. సైంటిస్టుల పరిశోధనలో తేలిన నిజం.
చిత్రంలో చూపినట్టుగా ఎవరికైనా అరచేతి మధ్యలో ఎక్స్ ఆకారంలో గుర్తు గనక ఉంటే వారు ప్రపంచాన్ని జయిస్తారట. దీనికి రుజువు ఏమిటంటే, అలెగ్జాండరే. ఆయనకు కూడా ఇలాగే ఉన్నందు వల్ల ప్రపంచాన్ని జయించగలిగాడని చరిత్ర చెబుతోంది. దీనిపై మాస్కోలోని ఎస్టీఐ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు పలు పరిశోధనలు కూడా చేశారు. అనేక మంది చేతి రేఖలను పరిశీలించారు. వారు పరిశీలించిన చేతి రేఖల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా దివంగత నేత అబ్రహం లింకన్ లకు చెందిన రేఖలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో సదరు పరిశోధకులు చెబుతున్నదేమిటంటే రెండు అర చేతుల్లోనూ పైన చెప్పినట్టుగా x ఆకారంలో గనక గుర్తు ఉంటే వారు అత్యంత ప్రతిభావంతులుగా ఉంటారట. వారు బలవంతులే కాదు ఏ పని చేయాలన్నా ప్రణాళిక లేకుండానే ముందుకు సాగి దాన్ని విజయవంతం చేయగలుగుతారట.
అరచేతుల్లో ఎక్స్ ఆకారంలో సింబల్ ఉన్న వారు విజయాల కోసం ప్రయత్నించకపోయినా విజయాలు వారి వెన్నంటే ఉంటాయట. ఇలాంటి వ్యక్తులు అవతలి వారిని గురించి సులభంగా అంచనా వేయగలుగుతారట. వీరిని మోసం చేయడం కూడా చాలా కష్టమేనట. ఎవరైనా హాని తల పెట్టాలని చూస్తే అది వ్యర్థమే అవుతుందట. వీరు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా శక్తివంతులుగా ఉంటారట. అంటురోగాలు వీరి దరి చేరవని, వీరు తమతోపాటు ఇతరుల జీవితాల్లోనూ మార్పు తేగలరని సదరు పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు తమ పదునైన ఆలోచనలతో తిరుగులేని విజయతీరాలకు చేరుతారట. అంతులేని పేరు ప్రతిష్ఠలను తెచ్చుకుంటారట. జనాల్లో నిలిచిపోతారట.
Post a Comment