Header Ads

ప్రొ కబడ్డీ లీగ్ ఆరంభానికి ప్రేరణ ఏమిటో తెలుసా ??

ప్రొ కబడ్డీ లీగ్.. దీన్నే వివో ప్రొ కబడ్డీ లీగ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే మొబైల్స్ తయారీ సంస్థ వివో దీనికి స్పాన్సర్‌షిప్‌ను అందిస్తోంది. 2014లో ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభం కాగా.. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఈ మ్యాచ్‌లు ప్రసారమవుతున్నాయి. అయితే ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభానికి ప్రేరణ ఐపీఎలే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయ్యాకే దానికి లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ప్రొ కబడ్డీ లీగ్‌ను ప్రారంభించారు. అయితే ఈ లీగ్ కూడా సక్సెస్ అయింది. ఆరంభంలో 8 టీంలు మాత్రమే పోటీ పడగా ఇప్పుడందులో 12 టీంలు ఉన్నాయి.



ప్రొ కబడ్డీ టీంలో ఒక్కో ఫ్రాంచైజీని 2.50 లక్షల అమెరికన్ డాలర్లకు ఆరంభంలో విక్రయించారు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు లభించినట్లే దీనికి కూడా ఆదరణ లభిస్తుందా, లేదా అని మొదట్లో సందేహించారు. కానీ పీకేఎల్ హిట్ అయింది. ఇక ఆ తరువాత ఈ లీగ్ వెనక్కి తిరిగి చూడలేదు. ఈ ఏడాది లీగ్ 6వ సీజన్ టోర్నమెంట్ ప్రస్తుతం నడుస్తోంది. ఇందులో బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ కేసీ, గుజరాత్ ఫార్చూన్ జియాంట్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ ప్యాంథర్స్, పాట్నా పైరేట్స్, పుణెరి పల్టాన్, తమిళ్ తలైవాస్, తెలుగు టైటాన్స్, యు ముంబా, యూపీ యోధా టీంలు పాల్గొంటున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్‌లో విజయాల విషయానికి వస్తే.. 2014లో మొదటి సీజన్‌లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ విజయం సాధించింది. తరువాత వరుసగా యు ముంబా (2015), పాట్నా పైరేట్స్ (2016 జనవరి, జూన్, 2017)లు వరుస సీజన్లలో విజయం సాధించాయి. గత మూడు సీజన్లలో పాట్నా పైరేట్స్ హ్యాట్రిక్ విజయాలను సాధించగా, తెలుగు టైటాన్స్ జట్టుకు చెందిన రాహుల్ చౌదరి 79 మ్యాచ్‌లలో 666 రైడ్ పాయింట్లను సాధించి ఆ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు.


ఇక సీజన్ 5 టోర్నమెంట్ విజేతలకు రూ.3 కోట్లు, మొదటి, రెండవ రన్నర్స్ అప్‌లకు రూ.1.8 కోట్లు, రూ.1.2 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అలాగే ఈ సీజన్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచే జట్లకు మొత్తం కలిపి రూ.10 కోట్ల వరకు ప్రైజ్ మనీని అందించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

No comments