Header Ads

హైదరాబాద్ సిటీ బస్సు జర్నీ లో తిప్పలు!

హైదరాబాద్ మహానగరం అంటే అందరికీ వెంటనే గుర్తు వచ్చేది చార్మినార్, ట్యాంక్ బండ్, గోల్కొండ......కానీ హైదరాబాద్ నగర వాసులకి మాత్రం గుర్తు వచ్చేది ట్రాఫిక్. అందులోను సిటీ బస్ లో ప్రతి రోజు ప్రయాణించే వారి బాధ వర్ణనాతీతం. హైదరాబాద్ లో ఏ సమయం లో ట్రాఫిక్ ఎలా ఉంటాదో ఎవరికి తెలియదు,లింగంపల్లి నుండి ఎల్ బి నగర్ వరకు సిటీ బస్సు లో ఒకరోజు గంటన్నర సమయం పడితే,అదే టైం కి మరుసటి రోజు అదే బస్సు లో రెండు గంటలు పడుతుంది, ఇక పొద్దున్న పూట మరియు సాయంకాల వేళలో సిటీ బస్సు ప్రయాణికులకు తిప్పలు తప్పవు, స్కూల్స్, కాలేజెస్, మరియు ఆఫీస్ లకి వెళ్లే సమయాలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి అందరు సమయానికి చేరుకోవాలి అని ఫుట్ బోర్డు పై వేలాడుతూ తిప్పలు పడుతూ వెళ్తారు,దీనికి తోడు పొద్దున్న మరియు సాయంకాల వేళల్లో ట్రాఫిక్ భీకరంగా ఉంటాది.



టెయిల్ టికెట్ (ట్రావెల్ అస్ యువర్ విష్) లేదా డే పాస్ 80/- రూపాయిలు తీసుకుంటే 24 గంటల పాటు హైదరాబాద్ సిటీ బస్సులలో ఎక్కడినుంచ్చి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు ,పర్యాటకులకు అనువుగా ఉండే ఈ టికెట్ తో ఏ/సి బస్సులు మినహా మిగిలిన సిటీ బస్సులలో ప్రయాణించవచ్చు, ఒక వేళా ఏ/సి బస్సులలో ప్రయాణించాలి అనుకుంటే 160/- రూపాయల డే పాస్ తీసుకుంటే 24 గంటల పాటు ఏ/సి సిటీ బస్సులు మొదలు మాములు సిటీ బుసులలో కూడా ప్రయాణించవచ్చు. పరిమితి కి మించి జనాలు ఉండటం తో బస్సు లోపల ఊపిరి అందటం కూడా కష్టం గానే ఉంటాది,జనాల రద్దీ దృష్ట్యా ముఖ్య మార్గాల్లో ఎక్కువ బస్సులే వేసిన పరిస్థితి మారలేదు, మెట్రో వచ్చాక కూడా పరిస్థితి ఇలాగె కొనసాగుతుంది, ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువ ఇబ్బందులకు గురి అవుతున్నారు, పెట్రోల్ డీజిల్ రేట్ లు విపరీతంగా పెరగటం తో చాలా మంది సిటీ బస్సులలో ప్రయాణించడానికి మొగ్గు చూపుతున్నారు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఆటో వాళ్లు రాజ్యం ఏలుతున్నారు, ముక్యంగా సిటీ బస్సు లు అడపా దడపా ఉండే ప్రదేశాల్లో, జనాలకి వేరే మార్గం లేక ఆటోలలో ప్రయాణిస్తున్నారు, అసలు ఇంతలా జన సంఖ్య పెరగడానికి కారణం ఉపాధి కల్పన అని చెప్పవచ్చు, హైదరాబాద్ మహా నగరం లో ఎక్కువ శాతం ఆదిలాబాద్ మొదలు అనంతపూర్ వరకు, చిత్తూర్ మొదలు శ్రీకాకుళం వరకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలందరూ బ్రతుకు తెరువు మరియు అవకాశాల కోసం వస్తారు, హైదరాబాద్ లో నివసించే ఇతర రాష్ట్రాల ప్రజల సంఖ్య కూడా ఎక్కువే, సౌత్ ఇండియా లో నార్త్ వాలు ఉండగలిగిన ప్రదేశాల్లో హైదరాబాద్ ప్రధమ స్థానం లో ఉంటుంది, ఎందుకంటె ఇక్కడ తెలుగు తో పాటు ఉర్దూ మాట్లాడే వాళ్ల సంఖ్యా కూడా ఎక్కువే.

No comments