పండ్ల మీద…స్టికర్స్ ను గమనించారా? ఆ స్టికర్స్ ను బట్టి వాటి గురించి చెప్పొచ్చు.!
ఆయా రకాల పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఎన్నో కీలక పోషకాలు శరీరానికి లభించడమే కాదు, పలు అనారోగ్యాలను కూడా పండ్లు తినడం వల్ల దూరం చేసుకోవచ్చు. శరీర నిర్మాణానికి, పెరుగుదలకు కూడా మనం పండ్లను తరచూ తీసుకుంటూ ఉండాలి. అప్పుడే పౌష్టికాహారం అంది సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అయితే పండ్లను తినడం వరకు బాగానే ఉన్నా, వాటిని కొనుగోలు చేసే సమయంలోనే కొన్ని జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా వాటిని ఎలా పండించారో మనకు తెలిసుండాలి. లేదంటే కృత్రిమ రసాయనాలు వాడి పండించిన పండ్లను తింటే పోషకాల మాట దేవుడెరుగు, అసలు ఆరోగ్యానికే మొదటికే మోసం వస్తుంది. కనుక ఆయా పండ్లను కొనుగోలు చేసేటప్పుడు వాటిని సహజ సిద్ధంగా పండించారా..? లేదంటే రసాయనాలు వాడారా..? అనే విషయాలను తెలుసుకోవడం తప్పనిసరి. మరి ఆ విషయాలను మనకు దుకాణదారులు చెప్పరు కదా..! అలాంటప్పుడు సదరు పండ్లను ఎలా పండించారో మనకు ఎలా తెలుస్తుంది..? అంటే అందుకు ఓ మార్గం ఉంది..!
మీరెప్పుడైనా పండ్లను కొనుగోలు చేసేటప్పుడు వాటిపై పలు సంఖ్యలతో కూడిన స్టిక్కర్లు ఉంటాయి గమనించారా..? వాటిని మీరు చూసే ఉంటారు. కానీ వాటి గురించి మీకు తెలిసి ఉండదు. అయితే అవే సంఖ్యలు పైన చెప్పిన సమాచారాన్ని తెలియజేస్తాయి. అంటే ఆ పండ్లను సహజ సిద్ధంగా పండించారా, లేదంటే రసాయనాలు వాడి పండించారా అనే సమాచారాన్ని ఆ స్టిక్కర్లు తెలియజేస్తాయి. అది ఎలా తెలుసుకోవాలంటే…
3 లేదా 4 అంకెతో నంబర్ ఉంటే…
పండ్లపై వేసే స్టిక్కర్ల మీద నాలుగు అంకెల నంబర్ ఉండి, ఆ నంబర్ 3 లేదా 4 తో ప్రారంభమైతే అప్పుడు ఆ పండ్లను కృత్రిమ రసాయనాలు, సహజ సిద్ధ ఎరువులు వాడి పండించారని తెలుసుకోవాలి. సాధారణంగా అలాంటి స్టిక్కర్లు ఉన్న పండ్లను 20వ శతాబ్దంలో వ్యవసాయంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల ఆధారంగా, నూతన పద్ధతులను ఉపయోగించి పండించారని తెలుసుకోవాలి.
9 అంకెతో నంబర్ ఉంటే…
పండ్లపై వేసే స్టిక్కర్ మీద ఐదంకెల నంబర్ ఉండి అది 9తో ప్రారంభమైతే అప్పుడు ఆ పండ్లను పూర్తిగా సేంద్రీయ ఎరువులను ఉపయోగించి అత్యంత సహజ సిద్ధమైన పద్ధతిలో పండించారని అర్థం చేసుకోవాలి. ఇవి మన శరీరానికి ఎలాంటి హాని కలిగించవు. పూర్తిగా సురక్షితమైనవి.
8 అంకెతో నంబర్ ఉంటే…
అదే పండ్లపై వేసే స్టిక్కర్ మీద ఐదంకెల నంబర్ ఉండి అది 8తో ప్రారంభమైతే అప్పుడు ఆ పండ్లను జన్యువుల మార్పిడితో పండించారని తెలుసుకోవాలి. ఇలాంటి పండ్లను అస్సలు తినకూడదు. అవి చాలా ప్రమాదకరం. అనారోగ్యాలను కలిగిస్తాయి.
Post a Comment