ఆవు పేడతో పేపర్ తయారీ.. మీరూ లక్షల్లో ఆదాయం ఆర్జించవచ్చు !!
పశ్చిమ బెంగాల్లో ఆవు పేడతో కరెంటు ఉత్పత్తి చేశారు. ఇక మొన్న జరిగిన వినాయక చవితి పండగకి చాలా మంది ఆవు పేడతో వినాయక విగ్రహాలను తయారు చేశారు. పంజాబ్లోనైతే ఆవుపేడతో ఇంటింటికీ బయో గ్యాస్‌ను అందిస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది ఆవు పేడను అనేక రకాలుగా వాడుకుంటున్నారు. అయితే తాజాగా రాజస్థాన్ కూడా ఇదే జాబితాలో చేరింది. ఇప్పుడక్కడ ఆవు పేడతో ఏకంగా క్వాలిటీ ఉన్న పేపర్‌నే తయారు చేస్తున్నారు.
రాజస్థాన్‌లోని కుమరప్ప నేషనల్ హ్యాండ్‌మేడ్ పేపర్ ఇనిస్టిట్యూట్ (కేఎన్‌హెచ్‌పీఐ)లో ఆవు పేడ, ర్యాగ్ పేపర్‌ను కలిపి మంచి క్వాలిటీ ఉన్న పేపర్‌ను తయారు చేస్తున్నారు. ఈ విధానంలో తయారైన పేపర్ సాధారణ పద్ధతిలో తయారైన పేపర్‌కు క్వాలిటీలో ఏమాత్రం తీసిపోకుండా ఉంది. ఈ క్రమంలోనే ఈ విధానం ఇప్పుడు రైతులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. జాలోర్‌లో ఉన్న ఓ గోశాల వారు ఇప్పటికే ఆవు పేడ ద్వారా పేపర్‌ను తయారు చేయడం మొదలు పెట్టారు. అయితే కేఎన్‌హెచ్‌పీఐ అభివృద్ధి చేసిన ఈ విధానం ద్వారా ఆవు పేడతో పేపర్‌ను తయారు చేసి మీరు కూడా లక్షల్లో ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ప్రస్తుతం ఈ విధానాన్ని ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కిందకు తీసుకురావాలని భావిస్తున్నామని, అది వస్తే, ఎవరైనా ఈ పేపర్ తయారీ ప్లాంట్ పెట్టుకోవచ్చని కేఎన్‌హెచ్‌పీఐ డైరెక్టర్ ఏకే గార్గ్ వెల్లడించారు.
ప్లాంట్‌ను ఆర్డర్ చేస్తే 15 నుంచి 20 రోజుల్లోగా ప్రతినిధులు వచ్చి ప్లాంట్‌ను నెలకొల్పుతారు. దీంతో మనం అనుకున్న క్వాలిటీ కలిగిన పేపర్‌ను ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయవచ్చు. అయితే ఈ ప్లాంట్ నెలకొల్పేందుకు రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీని వల్ల ప్లాంట్ సైజ్‌ను బట్టి 10 నుంచి 15 మందికి ఉపాధి కూడా లభిస్తుంది.
కాగా మార్కెట్లో కేజీ ఆవు పేడ ఖరీదు రూ.4 నుంచి రూ.5 ధర పలుకుతోంది. ఈ క్రమంలో ఆవు పేడ ద్వారా పేపర్‌ను తయారు చేసి పట్టణాలు, నగరాల్లో అమ్మితే మంచి లాభాలు వస్తాయి. అలాగే ఈ పేపర్‌ను రాసేందుకు మాత్రమే కాకుండా, కాగితపు బ్యాగుల తయారీకి కూడా ఉపయోగించవచ్చు. ఇక ఈ పేపర్ తయారీవిధానం పైన చెప్పిన స్కీం కిందకు వస్తే అప్పుడు ఎంతో మందికి ప్రయోజనం కలుగుతుంది..!

Post a Comment