Header Ads

బ‌ట్ట‌ల షాప్ ల‌...ద‌స‌రా గోల్ మాల్.! త‌నిఖీల్లో బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు.!!

ద‌స‌రా సీజ‌న్ లో ఆఫ‌ర్ల పేరుతో క‌స్ట‌మ‌ర్ల‌ను అడ్డ‌గోలుగా దోచుకోడానికి వ‌క్ర‌మార్గాలు ప‌ట్టిన ప‌లు షాపింగ్ మాల్స్ , బ‌ట్ట‌ల దుకాణాల‌పై స‌డెన్ రైడ్ చేసిన లీగ‌ల్ మెట్రాల‌జీ అధికారులు సుమారు 400ల‌కు పైగా కేసులు న‌మోదు చేశారు. శుక్ర‌వారం ఒక్క‌రోజే 200 కేసులు న‌మోదుచేశారు. త‌మ వాట్సాప్ నెంబ‌ర్ల‌కు వ‌చ్చిన‌ పిర్యాదుల ఆధారంగా అధికారులు చేప‌ట్టిన ఈ త‌నిఖీలో....బ‌ట్ట‌ల షాపుల మోసాలు వెలుగులోకి వ‌చ్చాయి.బ‌ట్ట‌ల షాప్ ల వాళ్లు చేస్తున్న మ‌త‌ల‌బు ఏంటి?


1+1 ఆఫ‌ర్స్, భారీ డిస్కౌంట్స్ అంటూ.....పాత రేట్ల స్థానంలో కొత్త రేట్ ట్యాగ్ ల‌ను యాడ్ చేసి..ఆఫ‌ర్ల ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు.
వాస్త‌వానికి ప్యాకేజ్డ్ కామోడిటీస్ యాక్ట్- 2011 ప్ర‌కారం ...ప్ర‌తి ప్యాకింగ్ పై దాని సైజ్, త‌యారీదారుల వివ‌రాలు, రేటు, తయారీ డేట్ , హెల్ప్ డెస్క్ నెంబ‌ర్ ముద్రించి ఉండాలి. ఇందులో ఏది లేకున్నా స‌ద‌రు షాప్ పై కేసు న‌మోదుచేయొచ్చు.

మీరు కంప్లైంట్ చేయాలా..?

బ‌ట్ట‌ల షాప్ లు చేస్తున్న మోసాలు మీ దృష్టికొచ్చాయా? అయితే మీరు డైరెక్ట్ లీగ‌ల్ మెట్రాల‌జీ డిపార్ట్మెంట్ కు డైరెక్ట్ వాట్సాప్ చేయొచ్చు.
WhatsApp number 7330774444
Toll Free Number 180042500333.

No comments