Header Ads

గ్యాస్ బండ క్రింద ఈరంద్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా ?

ప్రపంచ నలుమూలలా ఎవరు ఎలా బ్రతికినా కడుపు నిండా భోజనం చెయ్యడానికే కదా. కష్టపడి ఉద్యోగాలు చెయ్యడం , రాత్రి పగళ్లు కష్టపడటం , పిల్లలను సైతం బేబీ కేర్ లలో వదిలివేసి మరి ఉద్యోగాలు చేస్తుంది , మంచి జీవితాన్ని , కడుపునిండా ఆహారాన్ని పొందడానికే. అయితే ప్రతి ఒక్కరి ఇంటిలో ఏమి ఉన్న లేకపోయినా వంట చెయ్యడానికి స్టోర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.




కావున కొంత కాలం మధ్యలో గ్యాస్ కాకుండా ఎలక్ట్రిక్ స్టవ్ లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు వచ్చాయి. కానీ అవి కూడా కొంత కాలానికి ఉపయోగం తగ్గిపోయింది. గ్యాస్ మాత్రం తమ రాజ్యం ఏలుతుంది. వచ్చిన దగ్గరి నుంచి క్రమక్రమంగా రేట్లు పెరుగుతూ గ్యాస్ ఇప్పటికి ఎంతో పరిణామం చెందింది. ఖచ్చితంగా ప్రతి ఇంటిలో రెండు గ్యాస్ సిలిండర్లు ఉండటం కామన్ గా మారిపోయింది.




అయితే మీరు గ్యాస్ సిలిండర్ క్రింది భాగంలో రంధ్రాలు ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా తెలుసుకోవాలని అనుకున్నారా? లేదు కదూ. ఒకవేళ మీకు సందేహం వచ్చినా తెలుసుకోవాలని ప్రయత్నించి ఉండరు. అందుకే మేము ఈ రోజు ఈ ఆర్టికల్ ద్వారా ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలియజెయ్యబోతున్నాం.




ప్రతి ఇంటిలో గ్యాస్ అనేది పొయ్యికి క్రింది భాగంలో ఉండేలాగా పెట్టడం జరుగుతుంది. ఇల్లు తుడిచే సమయంలో లేదంటే కడిగే సమయంలో కొంత కాక పోయినా కొంతైనా సిలిండర్ క్రింది భాగంలో నీరు అనేది చేరుతుంది . అలా నీరు చేరి ఉండటం ద్వారా సిలిండర్ తుప్పు పట్టి మెల్లి మెల్లిగా అక్కడ రంద్రం ఏర్పడి గ్యాస్ లీక్ అవ్వడం లేదంటే సిలిండర్ పేలిపొయ్యే అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రంధ్రాలు అనేవి ఉండటం ద్వారా అందులో నుండి గాలి లోపలి వెళ్లి అక్కడ ఉండే నీరును ఆరిపొయ్యెలా చేస్తుంది. దాంతో తుప్పు పట్టే అవకాశం ఉండదు. దీని వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి సిలిండర్ క్రింది వైపు రంధ్రాలు పెట్టడం జరిగింది. అదీ ఫ్రెండ్స్ సంగతి .

No comments