Header Ads

అరవింద సమేత వీర రాఘవ మూవీ కలెక్షన్స్ కి బ్రేక్ పడటానికి హీరో రామ్ కారణమా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. సునీల్, జగపతి బాబు, నవీన్, ఈషా రెబ్బ ముఖ్య పాత్రలు పోషించిన ఏ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు, విడుదల అయిన రోజు నుండే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోయిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు బ్రహ్మాండమైన కలెక్షన్స్ తో దుమ్ము రేపింది,రెండో రోజు నుండి నెమ్మదించింది యుఎస్ లో 3 మిలియన్ మార్క్ ని అందుకుంటుంది అని ప్రతి ఒక్కరు భావించారు,కానీ 2.5 మిలియన్ మార్క్ ని కూడా అందుకోటం కష్టమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు, యు.ఎస్ లో 2.9 మిలియన్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యినట్టు, ఆ మార్క్ ని అందుకోటం ఇక అసాధ్యమే. తెలుగు రాష్ట్రాల్లో దసరా సీసన్ తర్వాత పూర్తిగా డీలా పడిపోయింది,



తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ రాకపోడానికి కారణం హీరో రామ్ నటించిన "హలో గురు ప్రేమకోసమే" చిత్రమే అని తెలుస్తుంది. రామ్,అనుపమ జంటగా నటించిన హలో గురు ప్రేమకోసమే చిత్రానికి త్రినాధ్ రావు డైరెక్షన్ వహించాడు,దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.ప్రకాష్ రాజ్,ప్రణీత ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.దసరా పండగ నాడు రిలీజ్ ఐన హలో గురు ప్రేమకోసమే చిత్రం అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది.రిలీజ్ ఐ వరం అవుతున్న ,హలో గురు ప్రేమకోసమే మూవీ కలెక్షన్స్ లో జోరు తగ్గలేదు,రామ్ మూవీ వలనే ఎన్టీఆర్ సినిమా సెకండ్ వీక్ కలెక్షన్స్ డల్ అయ్యాయి అని ఫిలిం నగర్ లో చెక్కర్లు కొడుతున్న వార్త.

చాలా  ఏరియాస్ లో డెఫిసిట్స్ తో నడుస్తున్న వీర రాఘవుడు శని ఆదివారాల్లో పుంజుకుంటాడో లేదో చూడాలి,యుఎస్ మొదలు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాస్ లో నష్టాలూ తప్పవని అంచనా. హీరో స్థాయికి మించి అమ్మితే హిట్ టాక్ తో కూడా నష్టాలూ తప్పవని వీర రాఘవుడు మరో సారి నిరూపించాడు.

No comments