Header Ads

అజ్ఞాతం లోకి వెళ్లిన హీరో శివాజీ ని బైటికి లాగండి అంటున్న ఎమ్మెల్యే రోజా

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మీద ఒక యువకుడు దాడి చేసిన విషయం అందరికి తెలిసిందే.  అయితే ఈ మొత్తం సంఘటన మీద ఆంధ్రప్రదేశ్ వైకాపా ఎమ్మెల్యే రోజా ఈ రోజు  స్పందించారు.  విశాఖపట్టణం విమానాశ్రయం లో జగన్ పైన జరిగిన హత్యాయత్నం వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడు లేక లోకేష్ లో తెలియాలి అని వైకాపా ఎమ్మెల్యే రోజా గారు ప్రశ్నించారు,చంద్రబాబు మరియు హీరో శివాజీ పైన ఆమె ఆరోపణలతో ధ్వజమెత్తారు.

వైకాపా ఎమ్మెల్యే రోజా మీడియా తో మాట్లాడుతూ ఇలా అన్నారు :


జగన్ పై దాడి జరిగిన తరువాత గంట వ్యవధిలోనే నిందితుడు, జగన్ కలిసున్నారంటూ చూపించేలా మార్ఫింగ్ చేసిన ఫొటోలను మీడియాకు చూపించారని, జగన్ అభిమాని అయితే, వెనుక వైఎస్, విజయమ్మల చిత్రాలు ఉంటాయని, అదే విధంగా ప్లెక్సీని ముద్రించిన స్టూడియో పేరు తప్పనిసరిగా ఉంటుందని, అవేమీ ఇందులో లేవు.

ఒక్క సినిమా అవకాశం కూడా లేకుండా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న శివాజీని ముందు పెట్టుకుని చంద్రబాబు 'ఆపరేషన్ గరుడ' అంటూ కొత్త నాటకాన్ని ప్రారంభించారు, కొత్త నాటకానికి తెరలేపిన చంద్రబాబు, అడ్రస్ లేని శివాజీతో కలసి డ్రామా ఆడుతున్నారు, ఆయనేదో కాలజ్ఞానిలాగా చెప్పారంటూ, దాన్ని ఇప్పుడు నమ్ముతున్నానంటూ పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు . ముందుగానే ఒక స్క్రిప్టు రాయించి, దాన్ని శివాజీతో చెప్పించి, వెనుకనుంచి నడిపిస్తున్నది చంద్రబాబా? లోకేషా అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలి. శివాజీని లోపలేసి మక్కెలిరగ కొడితే, అసలు నిజాలన్నీ బయటకు వస్తాయని ప్రతి ఒక్కరూ అంటున్నారు . 'ఆపరేషన్ గరుడ' ఎవరు నడిపిస్తున్నారు ? దాని సూత్రధారులు ఎవరు వంటి విషయాలన్నీ శివాజీ నోటి నుంచి చెప్పించాలి-వైకాపా ఎమ్మెల్యే రోజా.

No comments