ఉగ్రవాదుల చేతిలో మరణించిన పోలీస్ ఆఫీసర్
మన దేశంలో ఉగ్రవాదుల సంఖ్యా గణనీయంగా పెరిగిపోయింది, ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతం లో పరిస్థితి మరి ఘోరంగా తయారు అయ్యింది పరిస్థితి. ఆ ప్రాంతం లో పోలీసులకే రక్షణ లేకుండా పోయింది, నిత్యం ప్రాణ భయం తో బ్రతకాల్సి వస్తుంది. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఇంతియాజ్ అహ్మద్ మీర్ అనే వ్యక్తి 'కుల్గామ్'పట్టణంలో ఎస్.ఐ( సబ్ ఇన్స్పెక్టర్గా) వ్యవహరిస్తున్నారు.
ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. దాంతో సెలవులపై ఇంటికి వెళ్లలేని పరిస్థితి. ఊరు దాటి వెళితే ఉగ్రవాదులు ఎక్కడ దాడిచేస్తారో? అని చాలా రోజుల పాటు తన కుటుంబానికి దూరంగా ఉన్నారు. అమ్మానాన్నలను చూడాలన్న ఆశ చావక ఎలాగైనా స్వస్థలానికి వెళ్లాలని వేషధారణ మార్చుకున్నారు.ఇలాగైతే ఉగ్రవాదులు తనను గుర్తుపట్టలేరని తోటి ఉద్యోగులకు చెప్పిన ఇంతియాజ్ ఆదివారం సాయంత్రం ప్రభుత్వ వాహనంలో కాకుండా తన వాహనంలోనే స్వస్థలానికి బయలుదేరారు. అయినప్పటికీ చావు అతన్ని వెంటాడింది. ఎలా కనుక్కున్నారో తెలీదు కానీ ఉగ్రవాదులు ఇంతియాజ్ వాహనాన్ని వెంబడించారు. పుల్వామా జిల్లాలోని వాహిబుగ్ ప్రాంతంలో ఇంతియాజ్‌ను అడ్డుకున్నారు. అతన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాంతో అతను అక్కడికక్కడే చనిపోయారు.
ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు ట్విటర్ ద్వారా ధృవీకరించారు.‘ఎస్సై ఇంతియాజ్‌ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. పుల్వామాలో ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ దారుణమైన ఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతియాజ్ కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.’ అని వెల్లడించారు. సోమవారం ఉదయం ఇంతియాజ్ భౌతికకాయాన్ని అతని స్వస్థలానికి తీసుకెళ్లారు. ఇంతియాజ్‌కు పోలీసు ఉద్యోగం అంటే ఎంతో ఇష్టం. అందుకే తన దేశాన్ని సురక్షితంగా ఉంచడం కోసం ఎంతో నిజాయతీగా డ్యూటీ చేసేవారు. ఇంతియాజ్ తల్లి తండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు, కాశ్మీర్ లో ఉగ్రవాద చర్యలకి అడ్డు అదుపు లేకుండా పోయింది, చిన్న పిల్లోలా దెగ్గర నుండి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి చేసే వాళ్ళ వరకు,ఏ క్షణాన ఎవరిని ఏమి చేస్తారో అని అనుక్షణం భయపడుతూ బ్రతుకుతున్నారు, మన మిలిటరీ వాలు నిత్యం ఉగ్రవాదుల స్థావరాల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఎంత మంది ఉగ్రవాదులని మత్తు పెట్టిన వారి సంఖ్యా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు, ఇంతియాజ్ కి జరిగిన ఘటన కాశ్మీర్ లో మరే ఒక్క పోలీస్ ఆఫీసర్ కి జరగకుండా చూసుకుంటాం అని కాశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ తెలిపారు1

Post a Comment