Header Ads

బాలీవుడ్ ప్రముఖ గాయకుడికి చేదు అనుభవం ఎదురైంది.

రాజకీయ నాయకుల పైన రాళ్ళూ, అవి ఇవి విసరడం మాములు విషయంగా మారిపోయింది,ప్రజలు వాళ్ల ఆవేదన కోపాన్ని ఆ రూపం లో తీర్చుకుంటారు, కానీ గాయకుల పైన ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోడం చాలా అరుదు,మరియు బాధాకరం. బాలీవుడ్‌ ‍ప్రముఖ గాయకుడు షాన్‌కు అసోంలో చేదు అనుభవం ఎదురైంది.




గువాహటిలో ఓ మ్యూజిక్‌ కన్సర్ట్‌లో పాల్లొనేందుకు వెళ్లిన షాన్‌ పాట పాడుతున్న సమయంలో సమయంలో ప్రేక్షకులు అతడిపై పేపర్‌ బాల్స్‌, రాళ్లు విసిరారు. ఆదివారం గువాహటిలో షాన్‌ ప్రదర్శన ఉండటంతో పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. తమ అభిమాన గాయకుడి గాత్రం వినాలని ఆశపడ్డారు.. అయితే షాన్‌ బెంగాలీ పాట పాడటంతో నిరాశకు గురయ్యారు. దీంతో అతడిపై రాళ్లు విసిరి దాడి చేశాడు. ఊహించని పరిణామానికి కంగుతిన్న షాన్‌. మధ్యలోనే పాటను ఆపివేసి, ‘ఈ పని చేసిందెవరో పట్టుకురండి. ఒక ఆర్టిస్టుకు ఇచ్చే గౌరవం ఇదేనా. ముందు మర్యాద నేర్చుకోండి. నాకు జ్వరంగా ఉన్నా మీకు వినోదం పంచాలనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తప్పు తెలుసుకున్న అభిమానులు తమని మన్నించాలంటూ ట్విటర్‌ వేదికగా షాన్‌ను క్షమాపణలు కోరుతున్నారు. షాన్‌ కూడా ఇందుకు సానుకూలంగా స్పందించాడు. ‘రాజకీయ నాయకుల మాటల ప్రభావంతోనే మీలో అసహనం పెరిగిపోయింది. ఏదో ఆవేశంలో మీరలా చేసి ఉంటారు. మరేం ఫర్వాలేదంటూ’ సమాధామిచ్చాడు. షాన్ పైన జరిగిన ఈ దాడిని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఖండించారు.

No comments