Header Ads

ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం: ప్రత్యేకతలు, విశేషాలు, విగ్రహంలోనే లిఫ్టులు! ఇంతకీఏక్కడో తెలిస్తే ఆచ్చర్యపోతారు.?

'ఉక్కు మనిషి' అని ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి వల్లభాయ్ పటేలు, 1875 వ సంవత్సరములో 31 వ తేదీ అక్టోబరు నెలలో పుట్టాడు.ఆ రోజులలో లక్షలాది రూపాయిలను ఆర్జించగలిగిన బారిష్టరు ప్రాక్టీసును వదిలివేసాడు. దేశభక్తితో స్వాతంత్ర్య పోరాటములో పాల్గొని గాంధీజీ, నెహ్రూలకు కుడి భుజము అయ్యాడు.పటేల్ గారికి ఒక కుమార్తె - మణిబెన్ పటేల్. ఒక్కడే సుపుత్రుడు దహ్యాభాయ్ పటేల్. సర్దార్ పటేల్ గారు భారత ఉప ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో వారి పుత్రుడు బొంబాయిలో ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త. తండ్రి ఎంత నిజాయితీపరుడో కొడుకు అంత అవినీతి పరుడు. తండ్రికి తెలియకుండా ఆయన పదవిని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడేవాడు. పటేల్ గారికి ఈ విషయం తెలిసింది. వెంటనే అప్పటి పరిశ్రమల శాఖ మంత్రికి ఒక లేఖ రాసారు. అందులో విషయం చదివితే సర్దార్ పటేల్ నిజాయితీ ఏమిటో, నాయకుడంటే ఎలా ఉండాలో తెలుస్తుంది. ఆ లేఖలో....
' నా కుమారుని పరిశ్రమల గురించి గానీ, అతని ప్రవర్తన గురించి గానీ నాకు ఎంతమాత్రం సంబంధం లేదు. ప్రభుత్వ పరంగా అతని మీద గానీ, అతని పరిశ్రమల విషయంలో గానీ ఏ రకమైన చర్యలు తీసుకోవడానికైవా మీరేమీ వెనుకాడననక్కరలేదు. మీరే చర్యలు తీసుకున్నా నేనేమీ కలుగజేసుకోను. 'ఇదీ ఆ లేఖ సారాంశం. ఇప్పటి వాళ్ళకు ఇదీ ఒక ప్రచారం కోసం చేసే జుమ్మిక్కుగా కనిపిస్తే ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే మనం రోజూ చూసేవి ఇలాంటి జిమ్మిక్కులే కనుక. కానీ ఆయన నిజాయితీని, నిబద్ధతనీ శంకించేవాళ్ళకు కొసమెరుపు ఏమిటంటే సర్దార్ వల్లభాయి పటేల్ అవినీతిని సహించలేక, తన ఏకైక పుత్రుడి మొహం చూడడానికి కూడా ఇష్టపడక చివరి రోజులు తన మిత్రుడి ఇంటిలో గడిపి అక్కడే కన్నుమూసారు. ఈ రోజుల్లో అలాంటి రాజకీయ నాయకుల్ని ఊహించగలమా? దేశ మొట్టమొదటి హోం మంత్రి సంస్థానాలను భారత ప్రభుత్వంలో విలీనంచేసేందుకు కీలకపాత్రపోషించిన సర్దార్‌ సర్దార్ వల్లభాయ్ పటేల్ 182 మీటర్లు ఎత్తైన విగ్రహం నేడు ప్రారంభోత్సవం జరుగుతోంది. ప్రపంచ దేశాల్లోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా ఈ విగ్రహం నమోదయింది.
అమెరికాలోని లిబర్టీ విగ్రహంకంటే రెండురెట్లు ఎత్తుగా ఉంటుందని ప్రధానిమోడీ స్వయంగా ప్రకటించారు. నర్మదా డ్యామ్‌ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తునఆనరు. రాజ్‌పిపాలా వద్ద ఏర్పాటుచేసిన ఈ విహ్రం నిర్మాణానికి 45 నెలల వ్యవధి పట్టింది. మొత్తం అంచనా వ్యయం 3001 కోట్లు గాప్రతిపాదించినా ప్రైవేటు సంస్థ ఎల్‌అండ్‌టి ఈ కాంట్రాక్టును 2989 కోట్లకు బిడ్‌దాఖలుచేసి సొంతంచేసుకుంది. 2013 అక్టోబరు 31వ తేదీప్రారంభించిన విగ్రహ నిర్మానం 2018 అక్టోబరు మధ్యస్తంనాటికి పూర్తిచేసారు. సర్దార్‌జయంతి సందర్భంగా గుజరాత్‌లో ఈ విగ్రహాన్ని బుధవారం ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించనున్నారు. మొత్తం 20వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలోను, 12 చదరపు అడుగుల కృత్రిమ సరస్సు నిర్మాణంతో ఈవిగ్రహం రూపుదిద్దుకుంది. ఈ విగ్రహ నిర్మాణంకోసం గుజరాత్‌  ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్  రాస్ట్రీయ ఏక్తాట్రస్టు పేరితప్రత్యేక ప్రయోజన వాహికను ఏర్పాటుచేసింది.
దేశవ్యాప్తంగా ఆరులక్షల గ్రామాలనుంచి ఈ విగ్రమం కోసం 5 వేల టన్నుల ఇనుమును సేకరించారు. ఐదులక్షలమంది భారతీయరైతులుసైతం ఈ విగ్రహానికి ఇనుమును విరాళంగా ఇచ్చారు. మొత్తం ఐదువేల టన్నుల ఇనుమును సేకరించిన ఎస్‌పివి ఈ విగ్రహం నిర్మాణానికే వినియోగించింది. ఈ విగ్రహంలో 5700 టన్నుల ఇనప ఆకృతులు, 75వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు, 18,500 టన్నుల స్టీల్‌ రాడ్‌లు, 22,500 టన్నుల ఇత్తడి షీట్లు వినియోగించారు. ఈ విహ్రం వద్దకు వెళ్లేందకు ఒక వంతెన నిర్మించారు. ఈ విగ్రహ ప్రాంతంలో సందర్శకుల కేంద్రం భవనాలు,మెమోరియల్‌ గార్డెన్‌, హోటల్‌, కన్వెన్షన్‌సెంటర్‌, అమ్యూజ్‌మెంట్‌పార్క్‌, పరిశోధనా కేంద్రాలు, వివిధ సంస్థలను నిర్మించారు. సర్దార్‌సహజసిద్ధంగా ధరించే పంచె లాల్చీ భుజంపై దోతీలతోనే ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. ఈ విగ్రహం వద్దకు వెళ్లేందుకు వేగవంతమైన ఎలివేటర్లను నిర్మించారు. విగ్రహం మొత్తం ఇత్తడితో పూతపూసారు. నదీమట్టానికి 500 అడుగుల ఎత్తున ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఒక్కసారిగా 200 మందిప్రజలు సందర్శించే వీలుంది. 212 కిలోమీటర్ల పొడవైన సర్దార్‌స రోవర్‌ రిజర్వాయరు, 12 కిలోమీటర్ల పొడవయిన గరుడేశ్వర్‌ రిజర్వాయర్లను ఈ విగ్రహం పైనుంచి వీక్షించే సదుపాయం ఉంది. ఐదు కిలోమీటర్ల పడవ ప్రయాణంతో కూడా విగ్రహానికి చేరుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో ఈ విగ్రహాన్ని నిర్మించింది. గుజరాత్‌ప్రభుత్వం సర్దార్‌ విగ్రహానికి వందకోట్లు కేటాయించింది. వరుసగా మూడేళ్లలో ఒ00 కోట్లు, కేంద్ర బడ్జెట్‌లో 200 కోట్లు కేటాయించారు. భారత దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసేవిధంగా రూపుదిద్దుకున్న ఈవిగ్రహాన్ని బుధవారం ప్రధాని నరేంద్రమోడీ ఆహావిష్కరించనున్నారు, భారత దేశానికే గర్వజారణంగా మిగిపోనుంది ఈ విగ్రహం

No comments