మీరు తింటున్న చికెన్ ఎంత వరకు సేఫ్..? ఇవిగో లెక్కలు.!
చికెన్‌తో చేసే ఏ వంటకాన్నయిన నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగానే తింటారు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, తందూరి చికెన్, బిర్యానీ, కబాబ్స్.. ఇలా లెక్కలేనని చికెన్ వంటకాలు ఉన్నాయి. అయితే చికెన్ వెరైటీలను ఎంజాయ్ చేయడం వరకు బాగానే ఉంది.. కానీ మనం తింటున్న చికెన్ ఎంత వరకు సేఫ్ అని ఎవరూ ఆలోచించడం లేదు. అవును, మీరు విన్నది నిజమే. మనం తింటున్న చికెన్ అయితే అస్సలు సేఫ్ కాదట. దాంతో మనకు ఇన్ఫెక్షన్లు వస్తాయట. ఇదే విషయం ది హిందూ, ది బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం సంస్థలు చేసిన పరిశోధనలో తెలిసింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.
జొయెటిస్ అనే కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో వెటర్నరీ మెడిసిన్లను తయారు చేసి విక్రయిస్తుంది. అయితే ఈ కంపెనీ కోడిపిల్లలు త్వరగా, ఎక్కువగా బరువు పెరిగేందుకు పలు యాంటీ బయోటిక్ డ్రగ్‌లను కూడా విక్రయిస్తోంది. అయితే వాటిని వాడి పెంచిన కోళ్లను తినడం వల్ల మనుషుల్లో ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని పరిశోధనల్లో తెలిసింది. దీంతో స్పందించిన ది వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లు సదరు యాంటీ బయోటిక్ డ్రగ్‌లపై నిషేధం విధించాలని చెప్పాయి. దీంతో ఆ నిర్ణయాన్ని అమెరికా, యూరప్ దేశాలు అమలు చేశాయి. ఈ క్రమంలో ఆయా దేశాల్లో ఇప్పుడు జొయెటిస్ తయారు చేస్తున్న యాంటీ బయోటిక్ డ్రగ్‌లపై నిషేధం ఉంది. వాటిని అక్కడ విక్రయించడం లేదు. కానీ ఇండియాలో మాత్రం ఆ కంపెనీ తయారు చేస్తున్న డ్రగ్‌లను యథేచ్ఛగా వాడుతున్నారు. ఇది ఇప్పుడు అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
యాంటీ బయోటిక్ డ్రగ్స్ వాడి పెంచబడిన కోళ్లను తినడం వల్ల బాక్టీరియా మరింత దృఢంగా తయారవుతుందట. మనం ఎలాంటి యాంటీ బయోటిక్ డ్రగ్‌ను వాడినా తట్టుకునేంత కెపాసిటీ వాటికి పెరుగుతుందట.దీంతోపాటు ఆ బాక్టీరియా మనకు ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్ల వల్ల మన దేశంలో ఏటా 1 లక్ష మంది చిన్నారులు, 7 లక్షల మంది పెద్దలు చనిపోతున్నారని తెలిసింది.ఇది మరింత దిగ్భ్రాంతిని కలిగించే విషయం.
కాగా సదరు జొయెటిస్ కంపెనీ మన దేశంలో ఆ యాంటీ బయోటిక్ డ్రగ్‌లను యథేచ్ఛగా విక్రయిస్తోంది. ఏకంగా ప్రకటనలు ఇచ్చి మరీ ఆ డ్రగ్స్‌ను ఆ కంపెనీ అమ్ముతోంది. తమ మందులను వాడి కోళ్లను పెంచితే అవి బలంగా తయారవుతాయని,ఎక్కువ బరువు పెరుగుతాయని ఊదరగొడుతుండడంతో రైతులు ఇప్పుడు ఆ మందులను ఎక్కువగా వాడుతున్నారట. దీని వల్ల మన దేశంలో చాలా వరకు ప్రాంతాల్లో అలా మందులతో పెంచబడిన కోళ్లనే అమ్ముతున్నారు. వాటినే మనం తింటున్నాం. అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం.
అయితే అసలు ఇలా ఎందుకు జరుగుతోంది ? ఆ డ్రగ్స్‌ను ఇండియాలో ఎందుకు బ్యాన్ చేయలేదు.? అంటే.. దాన్ని మన ప్రభుత్వాల నిర్లక్ష్యంగా చెప్పవచ్చు అవును.. కచ్చితంగా ఇది మన ప్రభుత్వాల నిర్లక్ష్యమే. ఎందుకంటే.. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో నిషేధంలో ఉన్న డ్రగ్స్‌ను ఇండియాలో ఎలా వాడుతారు.?అనే కామన్ సెన్స్ కూడా మన నేతలకు లేకుండా పోయింది. అసలు ఈ విషయాన్ని పట్టించుకునే వారే లేరు.ఇక స్పందించి చర్యలు ఎలా తీసుకుంటారు.? అలా జరుగుతుందని మనం ఆశిస్తే అది మన భంగపాటే అవుతుంది. ఏది ఏమైనా.. చికెన్ ప్రియులారా..? జాగ్రత్త..!

Post a Comment