Header Ads

హీరో శివాజీపై ఫిర్యాదు చేసిన వైకాపా నేతలు! ఆపరేషన్ గరుడ సీక్రెట్ బయట పెడతా .! శివాజీ.

విశాఖపట్నం విమానాశ్రయం లో జగన్ పైన జరిగిన దాడి గురుంచి అందరికి తెలిసిందే, కానీ ఈ సంఘటన జరుగుతుంది అని హీరో శివాజీ ముందే చెప్పాడు, ఆపరేషన్ గరుడ అంటూ అప్పట్లో గోల చేసాడు,కానీ అప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, అయన ఆపరేషన్ గరుడ అంటూ పెట్టిన వీడియో ని కామెడీ వీడియో కింద జత కట్టి సోషల్ మీడియా లో విపరీతంగా ట్రోల్ల్స్ వేశారు. గత కొన్ని రోజులుగా ఎవరు శివాజీ ని పట్టించుకోవట్లేదు,అగ్న్యాతం లోకి వెళ్లిన హీరో శివాజీ గురుంచే ప్రస్తుతం రాష్ట్రమంతా చర్చ సాగుతుంది, కామెడీ వీడియో కింద జత కట్టిన ఆ ఆపరేషన్ గరుడ వీడియోని ఇప్పుడు ఒకటికి రెండు సార్లు చూస్తున్నారు జనాలు,నిజంగానే ఆ వీడియో లో చెప్పినది చెప్పినట్టుగా జరుగుతాయా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.




ఇదిలా ఉంటె, హీరో శివాజీపై విజయవాడ కమిషనర్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ గరుడ వ్యాఖ్యలపై శివాజీని విచారించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే జగన్‌పై దాడి జరుగుతుందని, శివాజీకి ముందే ఎలా తెలుసో చెప్పాలని వైసీపీ నేతలు నిలదీశారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి కేసులో శివాజీ పాత్ర ఉందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శివాజీపై ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి, గౌతంరెడ్డి ఉన్నారు.ఆపరేషన్ గరుడ వీడియో లో శివాజీ మాటలు కలకలం రేపాయి.

ప్రతిపక్ష నేతపై ప్రాణహాని లేనట్టి దాడి జరుగుతుందని, ఈ దాడి నెపంతో ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చూస్తున్నారని సంచలన విషయాలు బయటపెట్టారు. ఇప్పుడు జగన్‌పై దాడి ఆపరేషన్‌ గరుడలో భాగమేనని రాష్ట్ర మంత్రులు, టీడీపీ ముఖ్య నేతలు పలువురు పేర్కొన్నారు.సీబీఐ కేసులు తెరవడం, ఆ పార్టీకి చెందిన వారి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం, చక్రబంధంలో ఇరికించడం. 2019 నాటికి ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఆపరేషన్‌ గరుడ లక్ష్యం.

దీనికోసం రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మరో ముఖ్య పార్టీని, కొత్త పార్టీని ఉపయోగించుకుంటారు. ఈ వ్యూహంలోకి కొందరు అభిమన్యుల్లా ప్రవేశిస్తారు. ఇలా వచ్చేవారిలో ఒక కొత్త నాయకుడూ ఉన్నారు. ఇప్పటికే ఉన్న ముఖ్యపార్టీ నాయకుడిపైన ఇప్పటికే గుంటూరు, హైదరాబాద్‌లో రెక్కీ నిర్వహించారు. ఆయనకు ప్రాణహాని లేకుండా దాడి జరుగుతుంది. ఈ దాడివల్ల రాష్ట్రంలో అలజడులు మొదలవుతాయి అని శివాజీ చెప్పిన విషయం తెలిసిందే.

అసలు హీరో శివాజీ మీడియా ముందుకు ఎందుకు రావట్లేదు,నిజంగానే ఆయనకి జగన్ పైన దాడి విషయం లో సంబంధం ఉందా?లేకపోతే ఆయన మాట వరసగా చెప్పిన మాటలు నిజమయ్యాయి అనే భయాందోళనలో ఉన్నాడా?ఏది ఏమైనా హీరో శివాజీ మీడియా ముందుకు వచ్చినప్పుడు ఇంకెన్ని ఆసక్తికర విషయాలు బయట పడుతాయో అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Watch Video:

https://youtu.be/CPcXM95Etys

No comments