అసలైన మగాళ్లు హెల్మెట్ ధరించరని అతను బైక్‌పై రాసుకున్నాడు. అందుకు ట్రాఫిక్ పోలీసుల కౌంటర్ హైలైట్..!
ద్విచక్ర వాహనం నడిపే వారు హెల్మెట్ కచ్చితంగా పెట్టుకోవాలి. అది మన ప్రాణాల్ని రక్షిస్తుంది. ప్రమాదకరమైన యాక్సిడెంట్ జరిగినా తలకు హెల్మెట్ పెట్టుకుని ఉంటే బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే దీన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. హెల్మెట్ పెట్టుకుంటే తమ జుట్టు పాడవుతుందనో, మరే ఇతర కారణం వల్లనో కొందరు హెల్మెట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యం చేస్తారు. దీంతో వారు ట్రాఫిక్ పోలీసులకు చిక్కి చలాన్లను కడుతుంటారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోతున్నది కూడా ఇలా హెల్మెట్ పెట్టుకోకుండా చలాన్లు పడిన ఓ వ్యక్తి గురించే.
పైన చిత్రంలో చూశారు కదా. ఆ వ్యక్తి పేరు సాదు హరికృష్ణా రెడ్డి. అతను తన టూవీలర్ వెనుక No Helmet, I die like real men అనే వాక్యం రాసుకున్నాడు. దీంతో ఆ ఫొటోను తీసిన ట్రాఫిక్ పోలీసులు అతనికి హెల్మెట్ లేనందన చలానా వేశారు. అంతేకాదు, అతని ఫొటోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వారు తమ పేజీలో పోస్ట్ చేశారు. దాని కింద పోలీసులు ఏమని కామెంట్ పెట్టారంటే.. We r extremely Sorry Mr. Krishna Reddy Sir. We won’t let U die. We will see that U “LIVE LIKE REAL MEN”. Please wear helmet & ride. సారీ కృష్ణారెడ్డి గారు. మేం మిమ్మల్ని చనిపోనివ్వం. మీరనుకున్నట్టుగా రియల్ మెన్లా మీరు జీవించడాన్ని మేం చూడాలనుకుంటున్నాం. కనుక దయ చేసి హెల్మెట్ పెట్టుకుని రైడ్ చేయండి. అంటూ పోలీసులు ఆ ఫొటోకు కామెంట్ పెట్టి దాన్ని తమ ఫేస్బుక్ పేజీలో షేర్ చేశారు. దీంతో ఆ పోస్టు కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది.
అయితే సదరు కృష్ణారెడ్డి అనే వ్యక్తి నిజానికి చాలా ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ-చలాన్ సైట్లోకి వెళ్లి అతని బైక్ నంబర్ సెర్చ్ చేస్తే దానికి వచ్చిన చలాన్లు, ఆ ఫొటోలను ఒక్కసారి చూడండి. వాటిని బట్టి అతను ట్రాఫిక్ రూల్స్‌ను ఎన్ని సార్లు బ్రేక్ చేశాడో మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా పోలీసులు పెట్టిన అతని పోస్టుకు భలే రెస్పాన్స్ వస్తోంది. కొందరు ఆ వ్యక్తిని విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం పోలీసులను విమర్శిస్తున్నారు. ఎందుకంటే.. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించే వారు పోలీసుల్లోనూ ఉన్నారని, ముందు వారిపై చర్యలు తీసుకోండంటూ పలువురు నెటిజన్లు ఆ పోస్టు కింద కామెంట్లు పెట్టారు. ఏది ఏమైనా… ప్రతి ఒక్కరు తమ సేఫ్టీ కోసం కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే.. ఏమంటారు..!
Post a Comment