Header Ads

కోహ్లీ రికార్డుల మోత‌.! ఇండియానుండి గ‌తంలో ఈ ఫీట్ ను ఎవ‌రు సాధించారు!?

వెస్టిండీస్ తో జ‌రుగుతున్న రెండో వండే మ్యాచ్ లో కోహ్లీ స‌రికొత్త రికార్డ్ ను సాధించాడు. వండే క్రికెట్ లోనే చాలా వేగంగా 10 వేలు పూర్తిచేసిన క్రికెట‌ర్ గా నిలిచాడు. భార‌త్ త‌ర‌ఫున 10 వేల ప‌రుగుల క్ల‌బ్ లో చేరిన 5 వ ఆట‌గాడిగా రికార్డ్ ను నెల‌కొల్పాడు. ఇండియా త‌ర‌ఫున ఇప్ప‌టికే స‌చిన్, సౌర‌భ్, రాహుల్ ,ధోని లు ఈ ఫీట్ ను సాధించాడు.

కోహ్లీ ఇత‌ర రికార్డులు:వైజాగ్ లో ఆడిన నాలుగు వన్డే మ్యాచ్‌ల్లో 118, 117, 99, 65 ,157 నాటౌట్ ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు సెంచ‌రీలు, రెండు అర్థ శ‌త‌కాలుండ‌డం విశేషం., ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో వేగంగా 1000 పరుగులు సాధించిన ఆటగాడు, వరుసగా మూడేళ్లు 1000కిపైగా పరుగులు సాధించిన ఆటగాడు.,వెస్టిండీస్‌పై అధిక సెంచరీలు(6) సాధించిన క్రికెటర్‌.

2008 అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన జ‌ట్టుకు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించిన కోహ్లీకి అప్పుడే టీమ్ ఇండియాకు ఆడే అవ‌కాశం ద‌క్కింది. శ్రీలంక తో జ‌రిగిన వండే మ్యాచ్ లో ఆరంగేట్రం చేసిన తొలిమ్యాచ్ లో కేవ‌లం 12 ర‌న్స్ కే ఔట్ అయ్యాడు. కెరీర్ స్టార్టింగ్ లో కోహ్లీకి ఎక్కువ ఛాన్సెస్ రాలేదు. ఎక్కువ‌గా బెంచ్ కే ప‌రిమితం అయ్యాడు., కీల‌క ప్లేయ‌ర్లు గాయాల పాలైన‌ప్పుడు కోహ్లీకి ఛాన్స్ ద‌క్కేది. ఆ త‌ర్వాత త‌న ఆట‌తీరుతో ...జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు కోహ్లీ నిల‌క‌డైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించి త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు, ఐపియ‌ల్ కూడా కోహ్లీకి ఓ మంచి ఫ్లాట్ ఫామ్ గా నిలిచింది.వన్డేల్లో వేగంగా 10వేల పరుగులు పూర్తిచేసిన టాప్-5 బ్యాట్స్‌మెన్

1. విరాట్ కోహ్లి - 213 మ్యాచ్‌లు 2. సచిన్ తెందూల్కర్ - 266 మ్యాచ్‌లు 3. సౌరవ్ గంగూలి - 272 మ్యాచ్‌లు 4. రికీ పాంటింగ్ - 272 మ్యాచ్‌‌లు 5. జాక్వెస్ కలిస్ - 286 మ్యాచ్‌లు

ఇండియా త‌ర‌ఫున అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్ళు.
1. సచిన్ టెండూల్కర్ - 18426 ప‌రుగులు
క్రికెట్ గాడ్... క్రికెట్ లోని మ్యాగ్జిమ‌మ్ రికార్డులు ఈ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ పేరు మీదే. వన్డేల్లో పది వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ స‌చిన్ యే.!
కెరీర్ స్టార్టింగ్ లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన స‌చిన్ న్యూజిలాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో రెగ్యులర్ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మెడనొప్పి కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన కారణంగా స‌చిన్ కు ఓపెనింగ్ చేసే అవ‌కాశం ల‌భించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సచిన్ టెండూల్కర్ ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారించాడు.

2. సౌరవ్ గంగూలీ - 11363 ప‌రుగులు
స‌చిన్ - సౌర‌భ్ ....క్రికెట్ చ‌రిత్ర‌లోనే ది బెస్ట్ ఓపెనింగ్ జోడి. స్ట్రెయిట్ సిక్స్ కొట్ట‌డంలో గంగూలీ స్టైలే వేరు. ఇండియన్ క్రికెట్ టీమ్ ఇత‌ని కెప్టెన్సీ టైమ్ లో పీక్స్ కు వెళ్లింది.

3. రాహుల్ ద్రవిడ్ - 10889 ప‌రుగులు
దివాల్ ...మిస్ట‌ర్ డిపండెబుల్..ఆ బ్యాటింగ్ స్టైలే వేరు. అదేదో గోడ క‌డుతున్న‌ట్టు, గులాబి మొక్క‌కు అంటు క‌డుతున్న‌ట్లు బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించ‌డం, ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్ద‌డం అత‌నికే చెల్లింది. టీమ్ అంతా సైకిల్ స్టాండ్ లా కూలుతుంటే అత‌ను మాత్రం గోడ‌లా నిల‌బ‌డిన ఇన్నింగ్స్ లు అనేకం.

4. మహేంద్ర సింగ్ ధోని - 10079 పరుగులు
జుల‌పాల ధోని, ధ‌నాధ‌న్ ధోని, కెప్టెన్ కూల్ ధోని, బెస్ట్ ఫినిష‌ర్ గా ధోని...ఇలా అనేక డైమెన్ష‌న్స్ లో క‌నిపించిన జార్ఖండ్ డైన‌మైట్ ధోని.
భార‌త్ క్రికెట్ ధోని పేరు లేకుండా అసంపూర్ణ‌మే అవుతుంది. మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్ మ‌న్ 10000 ప‌రుగులు చేయడం నిజంగా ఆశ్చ‌ర్య‌మే.! 50 కు పైగా ఉంటే అత‌ని స‌గ‌టు, వేగంగా ప‌రుగులు చేయ‌గ‌లిగే అత‌ని స‌త్తా కార‌ణంగా అత‌ను 10 వేల క్ల‌బ్ లో ఉన్నాడు.No comments