యాపిల్ సంస్థ తయారు చేసిన యాపిల్ వాచ్ అతని ప్రాణాలను కాపాడింది. ఎలాగో తెలుసా..?
సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తయారు చేసే ఐఫోన్ల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో మోడల్స్ వాటిల్లో వచ్చాయి. ప్రపంచంలో సురక్షితమైన, విలాసవంతమైన ఫోన్ల జాబితాకు వస్తే అందులో ఐఫోన్ మొదటి స్థానంలో ఉంటుంది. అందులో యూజర్లకు లభించే ఫీచర్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకే చాలా మంది స్మార్ట్‌ఫోన్ ప్రియులు జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్‌ను వాడాలని కలలు కంటుంటారు. అయితే ఐఫోన్‌లాగే యాపిల్ తయారు చేసిన యాపిల్ వాచ్ కూడా ఎంతో పేరుగాంచింది. ఇందులో అనేక రకాల ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి. ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు చేసుకోవడం దగ్గర్నుంచి, ఫిట్నెస్ ట్రాకర్‌గా, హార్ట్ రేట్‌ను కొలిచే సాధనంగా యాపిల్ వాచ్‌ను అనేక మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడిదే యాపిల్ వాచ్ ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడింది. ఎలాగో తెలుసా..?
అతని పేరు గాస్టన్ డీఅక్వినో. వయస్సు 76 సంవత్సరాలు. ఉంటున్నది హాంగ్‌కాంగ్‌లో. అయితే ఈ మధ్య గాస్టన్ ఒకసారి చర్చిలో ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అతని హార్ట్ బీట్ పెరిగింది. దీంతో ఆ విషయాన్ని ట్రాక్ చేసిన అతని చేతికి ఉన్న యాపిల్ వాచ్ వెంటనే అతనికి హార్ట్ ఎటాక్ వచ్చే సూచన ఉందంటూ మెసేజ్ ఇచ్చింది. దాన్ని గమనించిన గాస్టన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లాడు.
అలా గాస్టన్ ఆస్పత్రికి వెళ్లగానే వైద్యులు వెంటనే అతనికి వైద్య పరీక్షలు చేశారు. ఈ క్రమంలో అతని గుండెకు అనుసంధానమై ఉన్న మూడు ప్రధాన ధమనుల్లో రెండు పూర్తిగా బ్లాక్ అయ్యాయని, మూడోది కూడా 90 శాతం బ్లాక్ అయిందని వారు గుర్తించారు. తరువాత గాస్టన్కు వైద్యులు శస్త్ర చికిత్స చేసి బ్లాక్స్‌ను తొలగించారు. దీంతో గాస్టన్ సేఫ్ గా ఇంటికి డిశ్చార్జి అయ్యాడు. అలా అతను యాపిల్ వాచ్ సహాయంతో హార్ట్ ఎటాక్ ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నాడు. అయితే ఇదే విషయాన్ని గాస్టన్ యాపిల్ సీఈవో టిమ్‌కుక్‌కు లేఖ రూపంలో తెలియజేస్తూ అలాంటి అద్భుతమైన వాచ్‌ను తయారు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. దీనికి టిమ్ కుక్ స్పందించి గాస్టన్కు థాంక్స్ చెప్పారు. అయితే ఇప్పుడే కాదు, గతంలోనూ ఇలా పలు సందర్భాల్లో యాపిల్ వాచ్ పలువురి ప్రాణాలను కాపాడింది. ఏది ఏమైనా యాపిల్ వాచ్ చేసిన ఈ అద్భుతానికి మనం అందరం ఆశ్చర్యపోవాల్సిందే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిందో ఈ వాచ్ ద్వారా మనకు ఇట్టే తెలుస్తుంది కదా..!

Post a Comment