Header Ads

స్కూల్ బస్సులు పసుపు రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా ?

ప్రకృతి మనకు ఎన్నో రంగులను ఇచ్చింది ప్రతి రంగుకు దేనికి ఉండే ప్రత్యేకత దానికి ఉంటుంది. అయితే మన మనుషులు కూడా ఒక్కో రంగుకు ఒక్కో ప్రాధాన్యతను ఇచ్చి ఉపయోగించడం మొదలు పెట్టారు. ఎలాగైతే ఒక్కొక్క దేశం యొక్క కరెన్సీ… జండా రంగులు వేరు వేరుగా ఉంటాయో అదే విధంగా ఆ దేశంలో రంగులను ఉపయోగించే విధానం కూడా వేరుగా ఉంటుంది. అయితే వీటిలో కొన్ని మాత్రం యూనివర్సల్ గా ఉంటె కొన్ని రంగులు ఉంటాయి. ఉదాహరణకు ఆర్మీ, లాయర్, పోలీస్ ,



డాక్టర్స్, అంబులెన్సు వంటివి ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా స్కూల్ మరియు కాలేజీ బస్లు ఎక్కడైనా పసుపు రంగులో ఎందుకు ఉంటాయో తెలుసుకుందాం క్రిందకి స్క్రోల్ చెయ్యండి.
స్కూలు బస్సుల రంగు నిమ్మకాయల వంటి స్వచ్ఛమైన పసుపూ కాదు, నారింజ లాంటి పసుపూ కాదు. ఈ రెండింటి మిశ్రమంగా పండిన మామిడి పండు రంగును పోలి ఉంటుంది. స్కూలు బస్సులకు ఈ రంగును వేయడంలో శాస్త్రీయ కోణం ఉంది. మనం ఎంత దూరం నుంచైనా పసుపు రంగు వస్తువును కంటి మూలల నుంచి కూడా స్పష్టంగా గుర్తించగలం. ఇలా గుర్తించడంలో మనకు అత్యంత తీవ్రత గల ఎరుపు రంగు కన్నా పసుపు విషయంలో 1.24 రెట్ల స్పష్టత ఉంటుంది. అలాగే మంచు పడుతున్న వాతావరణంలో కానీ, తెల్లవారు జామున, సాయం సమయాల్లో మసక చీకట్లో కానీ పసుపురంగును మిగతా వాటికన్నా బాగా చూడగలుగుతాం.

వర్ణదృష్టిలోపం ఉన్నవారికి రంగులు సరిగా కనపడవు. ముఖ్యంగా ఎరుపు రంగు అలాంటి వారికి నల్లగా, చీకటి రంగులో కనిపిస్తుంది. అదే పసుపు రంగు విషయంలో ఈ దృష్టి లోపం ఉండదు. ఈ విషయాల దృష్టిలో పెట్టుకునే పసివాళ్లు పయనించే బస్సులకు పసుపురంగు వేయాలని 1939లో ఉత్తర అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఫ్రాంక్‌ సైర్‌ ఒక సమావేశంలో ప్రతిపాదించారు. డాక్టర్‌ సైర్‌ ‘Father Of Yellow School Bus’గా ప్రసిద్ధిగాంచారు. స్కూలు బస్సులకు వేసే పసుపు రంగు సీసం కలిపిన క్రోమ్‌ఎల్లో. అందుకే ఇది మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

No comments