బస్సులో చిల్లర లేదని అతనికి రూ.35 ఇచ్చా.. తరువాత ఏమైందంటే..?
ఆరోజు నేను సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నా. బస్సు అంతా జామ్ ప్యాక్ అయింది. కాలు తీసి కాలు పెట్టేందుకు కూడా స్థలం లేదు. నా పక్కనే ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. అతని పేరు తెలియదు. అతన్ని A అనుకుందాం. అతని వద్దకు కండక్టర్ వచ్చాడు. టిక్కెట్ అడిగాడు. అతను ఏదో స్టాప్ పేరు చెప్పాడు. అక్కడికి రూ.35 అవుతుంది. కానీ అతని వద్ద రూ.500 నోటు ఉంది. చిల్లర లేదు. దీంతో అతను బస్సులో అందరినీ చిల్లర అడిగాడు. ఎవరూ లేదన్నారు. చివరకు అతను నా వద్దకు వచ్చాడు. అప్పుడు..
అతను అలా రూ.500 నోటుకు చిల్లర అందరినీ అడిగాడు. అప్పుడు సమయం ఉదయం 8 అయింది. చిల్లరి ఎవరి దగ్గరా లేదు. కండక్టర్ దగ్గర అసలే లేదు. దీంతో ఎవరూ చిల్లర లేదన్నారు. చివరకు అతను నన్ను అడగబోయేసరికి నేను లేదన్నట్టుగా అడ్డంగా తలూపా. దీంతో ఆ యువకున్ని కండక్టర్ తిట్టబొయాడు. బస్సు ఎక్కేటప్పుడు చిల్లర దగ్గర పెట్టుకోవాలన్న కామన్ సెన్స్ లేదా అని కండక్టర్ అనేశాడు. దీంతో నా దగ్గర ఉన్న చిల్లర ఆ యువకుడికి ఇచ్చా. అప్పుడతను థాంక్స్ చెప్పాడు. మీకు పేటీఎం ఉంటే ఆ నంబర్ చెప్పండి. డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తానని అతను అన్నాడు. నాకు పేటీఎం అకౌంట్ లేదని, డబ్బులివ్వకపోయినా ఫర్వాలేదులే అని అన్నా. అక్కడికి అలా జరిగిపోయింది.
తరువాత ఒక రోజు పాంటాలూన్స్ వెళ్లా. నా ఫ్రెండ్స్ తో షాపింగ్ చేస్తున్నా. అందులో ఒక జీన్స్ కనిపించింది. దానిపై ఆఫర్ ఉంది. 50 శాతం డిస్కౌంట్ కూడా ఉంది. వెంటనే దాన్ని తీసుకుని బిల్లింగ్ కౌంటర్ వద్దకు వెళ్లా. అయితే అక్కడ నాకు ఆశ్చర్యం వేసింది. ఆ రోజు బస్సులో కనిపించిన యువకుడే (A) అతను. పాంటాలూన్స్లో పనిచేస్తున్నాడు. అతను కూడా నన్ను గుర్తు పట్టాడు. అతను ఆ ప్యాంట్ తీసుకుని చెక్ చేసి.. సారీ అండీ.. ప్యాంట్‌పై డిస్కౌంట్ ఉన్న మాట నిజమే అయినా రిజస్టర్డ్ మెంబర్స్‌కు మాత్రమే. సాధారణ వినియోగదారులు మొత్తం చెల్లించాల్సిందేనన్నాడు. దీంతో ఉసూరమన్నా. అయితే వెంటనే అతను.. ఫర్వాలేదు.. నా నంబర్ రిజిస్టర్ అయింది. దానిపై కొనండి. మీకు 50 శాతం డిస్కౌంట్ వస్తుంది.. అన్నాడు. అందుకు సంతోషించా.. వెంటనే బిల్లింగ్ అయిపోయింది. రూ.1300 ప్యాంట్ నాకు డిస్కౌంట్ కింద రూ.650కే వచ్చింది. అలా అప్పుడు నేను సహాయం చేయబట్టి అది నాకు మళ్లీ సహాయం అయింది. దీన్ని బట్టి మనకు తెలుస్తుందేమిటంటే.. మనం ఏదైతే చేస్తామో.. అది మనకు రివర్స్‌లో వస్తుంది.. అది కరెక్టే కదా..!
Post a Comment