ఈ యాప్ మీ ఫోన్లో ఉంటే నెలకు రూ.20వేలు సంపాదించవచ్చు. ఎలాగో తెలుసా..? వీడియో అప్లోడ్ చేస్తే చాలు.!
వాట్సాప్, ఫేస్బుక్ లేదా ఇతర సోషల్ మీడియా సైట్లలో మనం నిత్యం అనేక రకాల వీడియోలను చూస్తుంటాం. వాటిల్లో వైరల్ అయినవి కొన్ని ఉంటే కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటాయి. ఇక వీటితోపాటు మనం అప్పుడప్పుడు సొంతంగా కొన్ని వీడియోలను క్రియేట్ చేస్తూ ఉంటాం. అయితే ఈ అన్ని వీడియోల ద్వారా మనకు డబ్బు వస్తే ఎలా ఉంటుంది ? భలేగా ఉంటుంది కదా. అవును, నిజమే. అయితే అదే అవకాశాన్ని మనకు కల్పిస్తుంది Hypstar (హైప్ స్టార్) యాప్. ఈ యాప్‌లో మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని ద్వారా మనం డబ్బు సంపాదించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
పైన చెప్పిన Hypstar యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తోంది. దీన్ని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాక అందులో రిజిస్టర్ చేసుకోవాలి. అందుకు ఫేస్బుక్ లేదా వాట్సాప్ అకౌంట్లను ఉపయోగించవచ్చు. లేదా కొత్త మెయిల్ ఐడీతో ఫ్రెష్‌గా రిజిస్టర్ చేసుకోవచ్చు. అనంతరం అందులో ఉండే ప్లస్ సింబల్‌ను క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఏదైనా వీడియోను అందులో అప్లోడ్ చేయాలి. అయితే వీడియో నిడివి 15 సెకండ్ల కన్నా ఎక్కువ ఉండాలి. అలా వీడియోను అప్లోడ్ చేశాక దాన్ని అదే యాప్‌లో ఉండే యూజర్లు చూస్తారు. దీంతో వారు చూసిన సంఖ్య (వ్యూస్)ను బట్టి మీకు సదరు యాప్ వారు డబ్బు చెల్లిస్తారు. అందుకు మీకు పేపాల్ (PAYPAL) అకౌంట్ ఉండాలి. ఆ సైట్లోకి వెళ్లి వివరాలను నింపి ఈ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. దాంతో లభించే ఐడీని హైప్స్టార్ యాప్ లో ఇస్తే మీకు వచ్చే డబ్బులు సదరు పేపాల్ ఐడీలో జమ అవుతాయి. అనంతరం పేపాల్‌లో ఉండే విత్‌డ్రా ఫీచర్ ద్వారా ఆ డబ్బును బ్యాంక్‌లోకి విత్ డ్రా చేసుకోవచ్చు.
ఇలా హైప్స్టార్ యాప్ ద్వారా నెలకు రూ.20వేల వరకు సంపాదించేందుకు వీలుంటుంది. ఈ యాప్‌లో మీరు సంపాదించిన డబ్బు 1 డాలర్ కాగానే మీకు పేమెంట్ చేస్తారు. గరిష్టంగా 200 డాలర్స్ జమ అయ్యే వరకు వేచి ఉండి తరువాత కూడా డబ్బును పేపాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే ఇదే కాకుండా ఈ యాప్‌లో మీరు పెట్టిన వీడియో వైరల్ అయితే అందుకు ప్రత్యేక పేమెంట్ ఇస్తారు. ఈ యాప్ ద్వారా యూట్యూబ్ కన్నా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.
హైప్స్టార్ యాప్ లో వీడియోలు అప్లోడ్ చేసి మాత్రమే కాక అందులో ఉండే ఫన్నీ గేమ్స్ ఆడినా, చాలెంజెస్ పూర్తి చేసినా మీకు రక రకాల గిఫ్ట్‌లు వస్తాయి. అలాగే ఈ యాప్‌ను మీ స్నేహితులు ఎవరికైనా రిఫర్ చేస్తే దాంతో మీకు డబ్బు చెల్లిస్తారు. ఇలా హైప్స్టార్ యాప్‌లో మీరు నెలకు రూ.20వేలకు పైగానే సంపాదించుకునేందుకు వీలుంటుంది. మరింకెందుకాలస్యం… వెంటనే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని డబ్బు సంపాదించండి మరి..!యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని డబ్బు సంపాదించండి మరి..!
Post a Comment